Rayachoty: రాయచోటిలో రాత్రివేళ పోలీస్ నిఘా పటిష్టం!

Rayachoty: రాయచోటి జిల్లా వ్యాప్తంగా రాత్రివేళ ప్రత్యేక నిఘా, గస్తీ ముమ్మరం చేసిన పోలీసులు. నేరాల నివారణకు ఎస్పీ ధీరజ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు వాహనాల తనిఖీలు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 7 Sept 2026 10:18 AM IST
Rayachoty
X

Rayachoty: రాయచోటిలో రాత్రివేళ పోలీస్ నిఘా పటిష్టం!

Rayachoty: రాయచోటి జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజూ రాత్రివేళల్లో పోలీసులు ప్రత్యేక నిఘా, గస్తీని ముమ్మరం చేశారు.

నేరాల నివారణ, రోడ్డు భద్రత కోసం వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలతో పాటు వాహనదారులు క్షేమంగా గమ్యం చేరేలా "పేస్ వాష్ అండ్ గో" కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు.

రాత్రిపూట సంచరించే అనుమానితుల వేలిముద్రలు సేకరిస్తూ, సరిహద్దులతో పాటు ఏటీఎంలు, దేవాలయాలు, నివాస ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్-100 లేదా 112కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story