Duvvuru: దువ్వూరు మండల పాఠశాలల్లో ఘనంగా 'మెగా పీటీఎం'!

Duvvuru: దువ్వూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశాలు ఘనంగా జరిగాయి.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 24 July 2026 10:58 PM IST
Duvvuru
X

Duvvuru: దువ్వూరు మండల పాఠశాలల్లో ఘనంగా 'మెగా పీటీఎం'!

Duvvuru: ప్రభుత్వ ఆదేశాల మేరకు దువ్వూరు మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలలో తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశాలు ఘనంగా నిర్వహించబడినవి. ఈ సమావేశాలలో విద్యార్థుల విద్యా ప్రగతిని తల్లిదండ్రులకు వివరించడం, LEAP యాప్‌ను డౌన్‌లోడ్ చేయించడం, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను పంపిణీ చేయడం జరిగింది.

అదేవిధంగా తల్లిదండ్రుల కోసం ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. సమావేశాలకు హాజరైన తల్లిదండ్రులందరికీ మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమాలలో అసెంబ్లీ నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ శ్రీ బి. ఆదిశేష రెడ్డి గారు, మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీ హిదాయతుల్లా గారు, మండల విద్యాశాఖ అధికారులు శ్రీ కె. రమణయ్య గారు, శ్రీ ఎస్. భాస్కర్ గారు పాల్గొన్నారు. వీరు మండలంలోని జెడ్పీహెచ్‌ఎస్ దువ్వూరు, ఎంపీపీఎస్ దువ్వూరు మెయిన్, కేజీబీవీ దువ్వూరు, జెడ్పీహెచ్‌ఎస్ పుల్లారెడ్డిపేట, జెడ్పీహెచ్‌ఎస్ గుడిపాడు తదితర పాఠశాలలను సందర్శించి కార్యక్రమాల నిర్వహణను పర్యవేక్షించారు.

అలాగే జెడ్పీహెచ్‌ఎస్ మాచెనపల్లెలో నిర్వహించిన తల్లిదండ్రుల–ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి ఎంఆర్ఓ శ్రీమతి బి. సునీత గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జెడ్పీహెచ్‌ఎస్ చల్లాబసాయపల్లిలో నిర్వహించిన సమావేశానికి డిప్యూటీ ఎంపీడీఓ శ్రీ హరికృష్ణ యాదవ్ గారు హాజరయ్యారు.

కేజీబీవీ పాఠశాలలో నిర్వహించిన సమావేశానికి ఎంపీడీఓలు శ్రీ సుబ్బారెడ్డి గారు, శ్రీ జవహర్ గారు పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని వివిధ పాఠశాలలను ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు శ్రీమతి కలావతి గారు, శ్రీమతి వరలక్ష్మి గారు తదితర మండల స్థాయి అధికారులు సందర్శించి కార్యక్రమాల నిర్వహణను పర్యవేక్షించారు.

దువ్వూరు మండలంలోని అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రుల విశేష భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ ఆత్మీయ సమావేశాలు విద్యార్థుల విద్యాభివృద్ధికి, పాఠశాల–తల్లిదండ్రుల సమన్వయానికి మరింత బలాన్ని చేకూర్చాయి.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story