Proddatur: ప్రొద్దుటూరు AMC ఇన్చార్జి చైర్మన్‌గా పట్నం లక్ష్మణ్ ప్రమాణం!
Proddatur: వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇన్చార్జి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన పట్నం లక్ష్మణ్. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం.
Proddatur: ప్రొద్దుటూరు AMC ఇన్చార్జి చైర్మన్‌గా పట్నం లక్ష్మణ్ ప్రమాణం!
Proddatur: ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇన్ఛార్జ్ ఛైర్మన్‌గా పట్నం లక్ష్మణ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సమక్షంలో మార్కెట్ కమిటీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన వద్ది బాలుడు సతీమణి వద్ది సురేఖ అనారోగ్య కారణాల వల్ల కొద్దిరోజుల క్రితం తమ పదవికి రాజీనామా చేశారు. దీంతో వైస్ ఛైర్మన్‌గా ఉన్న పట్నం లక్ష్మణ్ ఇన్ ఛార్జ్ ఛైర్మెన్ గా బాధ్యతలను అప్పగించారు.
ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సమక్షంలో మార్కెట్ యార్డ్ కార్యాలయంలో పట్నం లక్ష్మణ్ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి నూతన ఇన్ ఛార్జ్ ఛైర్మన్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. మార్కెట్ యార్డ్ పరిధిలోని రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం పట్నం లక్ష్మణ్ మాట్లాడుతతు తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన MLA వరదరాజులరెడ్డి కీ పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. యార్డ్‌కు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తానని, మార్కెట్ కమిటీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ ఎంపీపీ రాఘవరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురాంరెడ్డి, యువ నాయకుడు బచ్చల ప్రతాప్, కూటమి నాయకులు, కార్యకర్తలు, మార్కెట్ యార్డ్ సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.




