Proddatur: వైసీపీ చెత్త ప్రభుత్వం కాబట్టే ప్రజలు చెత్తకుప్పలో వేశారు!

Proddatur: ప్రొద్దుటూరులో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వైసీపీపై తీవ్ర విమర్శలు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 17 July 2026 4:24 PM IST
Proddatur
X

Proddatur: వైసీపీ చెత్త ప్రభుత్వం కాబట్టే ప్రజలు చెత్తకుప్పలో వేశారు!

Proddatur: కడప జిల్లా ప్రొద్దుటూరులో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం వైసీపీ ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతి, చెత్త నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందని ఆరోపించారు. రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. గతం లో గొడ్డలి పార్టీ పాలన అవినీతి, చెత్త పాలనతో సాగిందని విమర్శించారు. ప్రొద్దుటూరు గొడ్డలి పార్టీ నాయకుడు రాచమల్లు అవినీతి గురించి మాట్లాడటం హషాస్పందనంగా ఉందన్నారు.

గత ప్రభుత్వం చెత్త పై పన్ను విధించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా లక్షల టన్నుల చెత్త పేరుకుపోయే పరిస్థితి తీసుకొచ్చిందన్నారు. చెత్త ప్రభుత్వం కాబట్టే ప్రజలు మిమ్మల్ని చెత్తకుప్పలో పడేశారు అన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చెత్త తొలగింపుతో పాటు శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడుతోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 107 ప్రాంతాల్లో చెత్త ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, ప్రొద్దుటూరులో రూ.11.5 కోట్ల వ్యయంతో ఆధునిక చెత్త శుద్ధి ప్రాసెసింగ్ సెంటర్ నిర్మాణం జరుగుతోందని వెల్లడించారు.

కడప జిల్లాకు ఉపయోగపడే ఒక్క ప్రధాన ప్రాజెక్టును కూడా వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదని ఆరోపించిన పట్టాభిరాం... కడప స్టీల్ ప్లాంట్ పేరుతో భారీ అవినీతి జరిగిందని అన్నారు. బ్రహ్మణి స్టీల్ వ్యవహారంలో వేల ఎకరాల భూములను తక్కువ ధరకు తీసుకుని వాటి ఆధారంగా బ్యాంకు రుణాలు పొందారని విమర్శించారు. గొడ్డలి పార్టీ గతంలో చేసినటువంటి అవినీతిని నాయకులను వదిలే పరిస్థితి లేదని పట్టాభి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్తియార్, టిడిపి నేత కొండారెడ్డి, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి జబీవుల్లా, మాజీ జెడ్పిటిసి మహేశ్వర్ రెడ్డి, ఖలీల్, తదితరులు పాల్గొన్నారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR

Next Story