Porumamilla: పోరుమామిళ్ల ఎంపీపీగా పెట్లు కుమారి ఎన్నిక!
Porumamilla: పోరుమామిళ్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీడీవో ఆధ్వర్యంలో ఎంపీటీసీలు ప్రమాణం చేయగా, ఎంపీపీగా పెట్లు కుమారి ఎన్నికయ్యారు.
Porumamilla: పోరుమామిళ్ల ఎంపీపీగా పెట్లు కుమారి ఎన్నిక!
పోరుమామిళ్ల: మండల కో-ఆప్షన్ సభ్యులు, అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక పూర్తి పోరుమామిళ్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో గురువారం నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వుల మేరకు ఉదయం 10 గంటలకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నూతన ఎంపీటీసీ సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (MPP) మరియు ఉపాధ్యక్షుల ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికలో ఎంపీపీగా పెట్లు కుమారి మెజారిటీతో ఎన్నిక కావడం జరిగింది. అదే విధంగా మండల కో-ఆప్షన్ సభ్యులను కూడా ఎన్నుకున్నారు.
కార్యక్రమం అనంతరం నూతన ఎంపీపీ పెట్లు కుమారి మాట్లాడుతూ, మండల అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి గ్రామానికి చేర్చుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఎంపీటీసీ సభ్యులు, మండల అధికారులు, వివిధ పార్టీల నాయకులు, పత్రికా విలేకరులు హాజరయ్యారు.




