Duvvuru: పీఎంజేజేబీవై ద్వారా రెండు కుటుంబాలకు రూ.4 లక్షల బీమా

Duvvuru: పీఎంజేజేబీవై ద్వారా నీలాపురం, పెద్ద సింగనపల్లి బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.4 లక్షల బీమాను ధువ్వూరు ఏపీజీబీ అధికారులు అందజేశారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 12 Oct 2026 5:01 PM IST
Duvvuru
X

Duvvuru: పీఎంజేజేబీవై ద్వారా రెండు కుటుంబాలకు రూ.4 లక్షల బీమా

​ధువ్వూరు: ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) పథకం పేద కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు (ఏపీజీబీ) ధువ్వూరు శాఖ మేనేజర్ ఎస్. రమణ పేర్కొన్నారు. ధువ్వూరు శాఖ పరిధిలోని ఇద్దరు పాలసీదారుల మరణానంతరం వారి కుటుంబాలకు చెందిన క్లెయిమ్‌లను బ్యాంకు ద్వారా విజయవంతంగా పరిష్కరించి, ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.4 లక్షల బీమా ప్రయోజనాన్ని అందజేసినట్లు ఆయన తెలిపారు.

​నీలాపురం గ్రామానికి చెందిన శ్రీమతి మడుగు జయమ్మ (భర్త నాగయ్య), అలాగే పెద్ద సింగనపల్లి గ్రామానికి చెందిన శ్రీమతి జొన్నవరం వీర పద్మావతమ్మ (భర్త రామచంద్రారెడ్డి) ధువ్వూరు బ్యాంకు శాఖలో పీఎంజేజేబీవై పథకంలో నమోదు చేసుకున్నారు. వీరి అకాల మరణంతో నిబంధనల ప్రకారం క్లెయిమ్ దరఖాస్తులను వేగంగా పరిశీలించి నామినీలకు బీమా మొత్తాన్ని అందించారు.

​ఈ సందర్భంగా శాఖాధికారి బి.ఎస్.వి. దుర్గ, ఫీల్డ్ ఆఫీసర్ ఎ. ఉమ, క్యాషియర్ బి. శరత్ చంద్ర మాట్లాడుతూ.. 18 నుంచి 50 ఏళ్ల వయస్సు గల బ్యాంకు ఖాతాదారులు ఏడాదికి కేవలం రూ.436 నామమాత్రపు ప్రీమియంతో రూ.2 లక్షల జీవిత బీమా రక్షణ పొందవచ్చని వివరించారు.

గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఆర్థిక అభద్రతను తొలగించేందుకు ఈ పథకంపై నిరంతరం అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ సామాజిక భద్రతా పథకంలో చేరి తమ కుటుంబాలకు భరోసా కల్పించుకోవాలని బ్యాంకు అధికారులు కోరారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR