Kadapa: బద్వేల్ పట్టణంలో వ్యభిచార నిర్వహణ రట్టు చేసిన అర్బన్ పోలీసులు!

Kadapa: బద్వేల్ పట్టణంలోని వ్యభిచార గృహాలపై అర్బన్ పోలీసులు దాడులు నిర్వహించి ముగ్గురిని అరెస్ట్ చేశారు.

B. ARUN KUMAR, BADVEL
Published on: 9 Aug 2026 3:42 PM IST
Kadapa
X

Kadapa: బద్వేల్ పట్టణంలో వ్యభిచార నిర్వహణ రట్టు చేసిన అర్బన్ పోలీసులు!

Kadapa: బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచార గృహలపై పోలీసుల దాడి – ముగ్గురు ముద్దాయిలు అరెస్టు ఒకరు పరారీ.బద్వేల్ టౌన్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు, బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది 08.08.2026 సాయంత్రం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

బద్వేల్ టౌన్, నెల్లూరు మెయిన్ రోడ్, మార్థోమ నగర్, ఘుమఘుమలు రెస్టారెంట్ ఎదురుగా గల వీధిలోని ఇంటి నెం. 4-2-4/D వద్ద మరియు బద్వేల్ టౌన్ లోని కింగ్ ప్లాజా రెస్టారెంట్ వెనుక వైపున వీధి లోని ఇంటి నెం. 4-3-95/1 వద్ద తనిఖీలు నిర్వహించగా, అక్కడ రెండిళ్లలో D. యెల్లారెడ్డి , 50 సంవత్సరాలు, అట్లూర్ మండలం , మిట్టి వెంకట లక్ష్మి 40 సంవత్సరాలు , రాజమండ్రి టౌన్ మరియు జగన్నాధం సుబ్బయ్య, 35 సంవత్సరాలు, భాకరాపేట జగనన్న కాలనీ , బద్వేల్ టౌన్ ఉన్నట్లు గుర్తించారు.

ప్రాథమిక విచారణలో, పై వ్యక్తులు ఇతర ప్రాంతాలకు చెందిన మహిళలను బద్వేల్‌కు పిలిపించి, విటులను సమకూర్చి వ్యభిచార కార్యకలాపాలను నిర్వహిస్తూ సంపాదన చేసుకొనేవారు. విచారణలో కందుల శ్రీలక్ష్మి దేవి కూడా ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న వ్యక్తిగా గుర్తించబడింది అని, ప్రస్తుతానికి ఆమె పరారిలో వుంది.తనిఖీలో Kama Sutra బ్రాండ్‌కు చెందిన 01 కండోమ్ బాక్స్‌లోని 06 ప్యాకెట్లు, 4 మొబైల్ ఫోన్స్,స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు నిందితులు విటులతో సంప్రదింపులు జరపడం మరియు వ్యభిచార కార్యకలాపాలకు సంబంధించి సమాచారాన్ని చేరవేయడం కోసం ఉపయోగించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనది.

ఈ ఘటనకు సంబంధించి D.ఎల్లా రెడ్డి , మిట్టి వెంకట లక్ష్మి మరియు జగన్నాధం సుబ్బయ్యలను అరెస్టు చేయడము జరిగింది. అలాగే కందుల శ్రీలక్ష్మి దేవిని కేసులో నిందితురాలిగా గుర్తించి, తదుపరి దర్యాప్తు చేపట్టడం జరిగింది.

ఈ సందర్భంగా బద్వేల్ అర్బన్ పోలీసుల తరఫున ప్రజలకు తెలియజేయునది ఏమనగా, పట్టణంలో వ్యభిచార కార్యకలాపాలు, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టపరమైన చర్యలు కఠినంగా కొనసాగుతాయని, ఇలాంటి కార్యకలాపాల గురించి సమాచారం ఉన్నట్లయితే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా పోలీసు అధికారులకు సమాచారం అందించాలని కోరడమైనది, సమాచారం యిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.

B. ARUN KUMAR, BADVEL

B. ARUN KUMAR, BADVEL

Next Story