Mydukur: శివపురం పొలాల్లో జూద స్థావరంపై పోలీసుల దాడి.. ఐదుగురు అరెస్ట్

Mydukur: మైదుకూరు మండలం శివపురం పొలాల్లో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.8,100 నగదు, పేకాట సామగ్రి స్వాధీనం.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 11 Nov 2026 8:04 PM IST
Mydukur
X

Mydukur: శివపురం పొలాల్లో జూద స్థావరంపై పోలీసుల దాడి.. ఐదుగురు అరెస్ట్

​మైదుకూరు: కడప జిల్లా మైదుకూరు మండల పరిధిలోని శివపురం గ్రామ పొలాల్లో పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. అర్బన్ సిఐ హాజీ వలి ఎస్సై చిరంజీవిల కు

​విశ్వసనీయ సమాచారం మేరకు మైదుకూరు పోలీసులు శివపురం గ్రామ శివారు ప్రాంత పొలాల్లో తనిఖీలు చేపట్టారు. అక్కడ గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 8,100 నగదుతో పాటు పేకాట సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

​ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మైదుకూరు పోలీసులు తెలిపారు. మండలంలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు, చట్టవిరుద్ధ పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR