Rayachoti: రాత్రిళ్ళు బైక్ లపై శబ్దాలు చేస్తే కఠిన చర్యలు
Rayachoti: రాయచోటిలో రాత్రి వేళల్లో బైక్‌లపై శబ్దాలు చేస్తూ, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Rayachoti: రాత్రిళ్ళు బైక్ లపై శబ్దాలు చేస్తే కఠిన చర్యలు
రాయచోటి: అన్నమయ్య జిల్లా పట్టణంలో ఇటీవల కొంత మంది యువకులు అర్ధరాత్రి వేళల్లో ద్విచక్ర వాహనాలపై ప్రమాదకర ఫీట్లు చేస్తూ, అధిక శబ్దాలు సృష్టిస్తూ, రింగ్ రోడ్లు, ప్రధాన వీధులలో ఇతర వాహన దారులు, ప్రజలను భయ భ్రాంతులకు గురిచేస్తున్నారని సమాచారంపై పోలీసులు దాడులు చేశారు.. అదే విధంగా రాత్రి సమయంలో ఇళ్ల పక్కన పార్క్ చేసి ఉన్న వాహనాల అద్దాలు ధ్వంసం చేయడం వంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న సంఘటన లను పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఈ నేపథ్యంలో రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బీవీ చలపతి తన సిబ్బంది తో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసారు. ఆదివారం రాత్రి అల్లరి చర్యలకు పాల్పడుతున్న ముగ్గరు యువకులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ నిర్వహించారు. అనంతరం వారికి కౌన్సిలింగ్ నిర్వహించి, వారి తల్లిదండ్రులను పిలిపించి ఇకముందు ఇలాంటి
చర్యలు పునరావృతం కాకుండా కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని గట్టిగా హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను అనవసరం గా రాత్రి వేళల్లో రోడ్లపై తిరగనీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజల ప్రశాంతతకు, భద్రతకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించే వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. రాయచోటి పోలీసులు ప్రజల ప్రాణ, ఆస్తి భద్రత కోసం కృషి చేస్తూ ప్రజలకు రక్షణ కల్పించేందుకు కట్టుబడి ఉన్నారు. పట్టణంలో ఎటువంటి చట్టవ్యతిరేక చర్యలు గానీ, అనుమానాస్పద సంఘట నలు గానీ గమనించిన వెంటనే డయల్ 100, 112 కు సమాచారం అందించా లన్నారు. సమాచా రం అందిన వెంటనే పోలీసులు తక్షణ స్పందనతో అవసరమైన సహాయ చర్యలు తీసుకుంటారు. ప్రజల సహకారమే పోలీసుల భద్రమైన రాయచోటి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వా ములు కావాలన్నారు.




