Rayachoti: రాయచోటిలో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన ర్యాలీ!

Rayachoti: రాయచోటి పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్ భవనాన్ని విద్యార్థులకు తిరిగి అప్పగించాలని ఏఐఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు లవకుమార్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 28 Aug 2026 3:29 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటిలో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన ర్యాలీ!

Rayachoti: రాయచోటిలో జిల్లా పోలీసు కార్యాలయానికి తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్న తమ హాస్టల్ భవనాలను తిరిగి తమకు అప్పగించాలని రాయచోటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు కళాశాల గేటు వద్ద శుక్రవారం ధర్నా చేశారు. అఖిలభారత స్టూడెంట్స్ పవర్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల లవకుమార్ ఆధ్వర్యంలో సుమారు 150 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు శుక్రవారం ఉదయం తరగతులు బహిష్కరించి కళాశాల గేటు వద్ద ప్లకార్డ్స్ ధరించి తమ హాస్టల్ చెప్పాలని నినాదాలు చేసి ర్యాలీ చేశారు.

ఈ సందర్భంగా లవ కుమార్ మాట్లాడుతూ 2022 లో అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని ప్రకటించిన సందర్భంలో ఎస్పీ కార్యాలయం కోసం పాలిటెక్నిక్ విద్యార్థుల హాస్టల్ భవనాలను తాత్కాలికంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదని అన్నారు. జిల్లా కేంద్రంలో రాయచోటి నుండి మదనపల్లి తరలిన తర్వాత ఎస్పీ ఆఫీసు జిల్లా కార్యాలయం అన్నీ కూడా మదనపల్లెకు తరలిపోయాయని ఇప్పుడైనా తమ హాస్టల్ భవనాలు తమకు అప్పజెప్పాలని విద్యార్థుల నినాదాలు చేశారు.

రాయచోటి పట్టణం నందు గల పాలిటెక్నిక్ కళాశాలలో ప్రస్తుతం 250 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని వారికి హాస్టల్ వసతి లేదని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆ కళాశాల హాస్టల్ భవనాలను హాస్టల్ భవనం నిర్మించిన తర్వాత పాలిటెక్నిక్ విద్యార్థులు వివిధ జిల్లాల నుండి వందలాదిమంది విద్యార్థులు ఆ కళాశాలలో చదువుకుంటూ వసతిగృహంలో ఉండేవారని భోజనం మరియు ఇతర మౌలిక సౌకర్యాలు ఆ విద్యార్థులకు ఉండేవని అన్నారు.

అయితే హాస్టల్ భవనమును ఎస్పీ గారి కార్యాలయానికి ఇచ్చిన తర్వాత కళాశాల విద్యార్థులు పట్టణంలో ఉన్నటువంటి బిసి ఎస్సి హాస్టల్స్ లో ఉంటూ 6 కిలోమీటర్ల మేర బస్సులలో ఆటోలలో ప్రయాణం చేసి ఉదయం టిఫిన్ చేసి మధ్యాహ్నం తిరిగి హాస్టల్ కు వెళ్లి తిని రావడానికి వీలు లేక ఉదయం చేసిన భోజనాన్నే తీసుకొని వచ్చి మధ్యాహ్నం తిని తిరిగి మళ్ళీ హాస్టల్స్ కి వెళ్లే పరిస్థితి వారికి నెలకొని ఉందని వారు మండిపడ్డారు. అంతేకాకుండా ప్రభుత్వ హాస్టల్స్ లో సీట్లు దొరకక ప్రైవేట్ హాస్టల్స్ లో నాలుగు వేల నుండి 5వేల రూపాయల వరకు డబ్బులు కట్టి వారు ఉండాల్సినటువంటి పరిస్థితి నెలకొని ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎస్పీ కార్యాలయ నిర్వహణకు తాత్కాలికంగా ఇచ్చినటువంటి పాలిటెక్నికల్ కళాశాల విద్యార్థుల వసతృహ భవనమును తిరిగి ఆ కళాశాల విద్యార్థులకు అప్పజెప్పాలని తద్వారానే వివిధ జిల్లాల నుండి వచ్చి ఇక్కడ విద్యను అభ్యసించే పేద ,మధ్యతరగతి విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించిన వారు అవుతారని లేనిపక్షంలో విద్యార్థులకు అప్పజెప్పేవరకు అఖిల భారత విద్యార్థి పవర్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని రాష్ట్ర అధ్యక్షులు లవకుమార్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో 150 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు మరియు ఏఐఎస్ పి జిల్లా నాయకులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story