Rajupalem: వెలువలి సర్పంచ్ బరిలో పొన్నపురెడ్డి శ్రీదేవి.. ఉత్సాహంగా ఇంటింటి ప్రచారం!
Rajupalem: కడప జిల్లా రాజుపాలెం మండలం వెలువలి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పొన్నపురెడ్డి శ్రీదేవి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
Rajupalem: వెలువలి సర్పంచ్ బరిలో పొన్నపురెడ్డి శ్రీదేవి.. ఉత్సాహంగా ఇంటింటి ప్రచారం!
Rajupalem: రాజుపాలెం మండలంలోని వెలువలి గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. మాజీ సర్పంచ్ పొన్నపురెడ్డి జైయ వీర ప్రతాపరెడ్డి సతీమణి పొన్నపురెడ్డి శ్రీదేవి సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, నంద్యాల కొండారెడ్డిల ఆశీస్సులతో ఆమె నేడు గ్రామంలో తన ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించారు.
గతంలో 2013 నుంచి 2019 వరకు వెలువలి గ్రామ సర్పంచ్‌గా పనిచేసిన పొన్నపురెడ్డి జయవీర ప్రతాపరెడ్డి, గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో నడిపించారు. ఆయన హయాంలో జరిగిన అభివృద్ధి పనులు, ప్రజలతో ఉన్న సత్సంబంధాలు ఇప్పుడు తమకు కలిసివస్తాయని నాయకులు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తన భర్త అడుగుజాడల్లో నడుస్తూ, వెలువలి గ్రామాన్ని మరింత ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు సర్పంచ్‌గా పోటీ చేస్తున్నట్లు పొన్నపురెడ్డి శ్రీదేవి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, యువ నాయకులు నంద్యాల కొండారెడ్డిల సంపూర్ణ ఆశీస్సులు, మద్దతుతో ఆమె నేడు గ్రామంలో పర్యటించారు.
ప్రతి ఇంటికి వెళ్లి గ్రామస్తులను ఆప్యాయంగా పలకరిస్తూ, తనను ఆశీర్వదించి సర్పంచ్‌గా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గతంలో తమ కుటుంబం చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తూ, గ్రామంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆమె హామీ ఇచ్చారు.
ఈ ప్రచార కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ముఖ్య నాయకులు, మహిళలు మరియు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీదేవికి తమ మద్దతుగా ఇంటింటికి వెళ్లి ప్రచారంలో పాల్గొన్నారు.




