Pulivendula: వేదిక దూరం.. పరిష్కారం లేక వెలవెలబోయిన రెవెన్యూ సదస్సు!
Pulivendula: పులివెందులలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ప్రజల నుంచి స్పందన కరువైంది. వేదిక దూరం కావడం, పాత అర్జీలు పరిష్కారం కాకపోవడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Pulivendula: వేదిక దూరం.. పరిష్కారం లేక వెలవెలబోయిన రెవెన్యూ సదస్సు!
పులివెందు: రైతులు, ప్రజల భూ సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు పులివెందు లలో ఆశించిన స్థాయిలో స్పందన కనిపించలేదు. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని న్యాక్ బిల్డింగ్ ఎదురుగా ఉన్న వైఎస్సార్ విస్టాలో శుక్రవారం పులివెందుల, లింగాల మండలాలకు సంబంధించి నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు రైతులు, ప్రజలు స్వల్ప సంఖ్యలోనే హాజరయ్యారు. దీంతో సదస్సు ప్రాంగణం పలుచనగా కనిపించింది.
కడప జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనా, జిల్లా ఉన్నతస్థాయి అధికారుల ఆధ్వర్యంలో, పులివెందుల ఆర్డీవో చిన్నయ్య, రెవెన్యూ అధికారులు, సిబ్బంది సమన్వయంతో సదస్సును నిర్వహించారు. భూ సమస్యలు, రెవెన్యూ రికార్డుల్లో మార్పులు, భూముల హద్దులు, పట్టాదారు పాసుపుస్తకాలు, వారసత్వం, భూ వివాదాలు తదితర సమస్యలపై ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు.
నెలలో నాలుగు శుక్రవారాలు సదస్సులు
రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలను స్థానికంగానే పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం భూ సమస్యల పరిష్కార వేదికగా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోంది. ఒక నియోజకవర్గంలో నెలకు నాలుగు శుక్రవారా లు సదస్సులు నిర్వహించే లా కార్యక్రమాన్ని రూపొందించింది. ఆయా మండలాల పరిధిలోని ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందే అవకాశం కల్పించింది.
అయితే పులివెందులలో శుక్రవారం నిర్వహించిన సదస్సుకు ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడం అధికార వర్గాల్లోనూ చర్చనీయాం శంగా మారింది. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తారని భావించినప్పటికీ కొద్దిమంది మాత్రమే సదస్సుకు రావడంతో అధికారులు అర్జీలను స్వీకరించారు.
పట్టణానికి దూరంగా వేదిక
సదస్సుకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కాకపోవడానికి ప్రధాన కారణాల్లో వేదిక ఎంపిక కూడా ఒకటని స్థానికులు చెబుతున్నారు. వైఎస్సార్ విస్టా ప్రాంతం పట్టణంలోని పలు ప్రాంతాల ప్రజలకు కొంత దూరంగా ఉండటం తోపాటు, అక్కడికి చేరుకు నేందుకు సరైన ప్రజా రవాణా సౌకర్యాలు లేకపోవడం ఇబ్బందిగా మారిందని పేర్కొంటు న్నారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే రైతులు, వృద్ధులు, మహిళలు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటు న్న వారు దూర ప్రాంతానికి రావడం కష్టంగా మారుతోం దని అంటున్నారు. ప్రజలకు సులభంగా చేరుకునే ఆర్డీవో కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం లేదా పట్టణం లోని ఇతర అందుబాటులో ఉన్న ప్రదేశాల్లో సదస్సులు నిర్వహిస్తే హాజరు పెరిగే అవకాశం ఉంటుందని ప్రజలు అభిప్రాయపడు తున్నారు.
అర్జీలు ఇచ్చినా పరిష్కారం కావడం లేదన్న భావన
మరోవైపు గతంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో అర్జీలు సమర్పించినప్పటికీ వాటిలో కొన్ని సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదన్న అసంతృప్తి ప్రజల్లో ఉన్నట్లు తెలుస్తోంది. సదస్సులకు వెళ్లి అర్జీలు సమర్పించినా సమస్య పరిష్కారం కాకపోతే మళ్లీ సదస్సుకు వెళ్లి అర్జీ ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏమిటన్న భావన కొందరు రైతుల్లో వ్యక్తమవుతోంది.
ప్రజల సమస్యలను విని అర్జీలు స్వీకరించడం మాత్రమే కాకుండా వాటిని సంబంధిత శాఖలకు పంపించడం, విచారణ జరిపించడం, పరిష్కారానికి గడువు నిర్ణయించడం వంటి చర్యలు తీసుకోవా లని రైతులు కోరుతున్నారు. గతంలో అందిన అర్జీలపై తీసుకున్న చర్యలను కూడా ప్రజలకు తెలియజేయాలని సూచిస్తున్నారు.
పరిష్కారాలతోనే ప్రజల్లో నమ్మకం
రెవెన్యూ సదస్సుల ఉద్దేశం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడానికే పరిమితం కాకుండా భూ సమస్యలకు పరిష్కారం చూపడమే కావాలని ప్రజా, రైతు సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఒకసారి అర్జీ ఇచ్చిన తర్వాత దాని పరిస్థితి ఏమిటి, ఏ అధికారి వద్ద ఉంది, ఎప్పుడు పరిష్కారం అవుతుంది అనే విషయాలను ప్రజలకు తెలియజేస్తే అధికార యంత్రాంగంపై నమ్మకం పెరుగుతుందని అంటున్నారు.ప్రత్యేకంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను గుర్తించి వాటికి ప్రాధాన్యత క్రమంలో పరిష్కారం చూపాలని కోరుతున్నారు. అవసరమైన సందర్భాల్లో సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే విధానాన్ని మరింత బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
అందుబాటులో ఉండే ప్రాంతాల్లో నిర్వహించాలి
రానున్న రెవెన్యూ సదస్సులకు పట్టణ ప్రజలతోపాటు గ్రామీణ ప్రాంతాల రైతులు కూడా సులభంగా చేరుకునేలా వేదికలను ఎంపిక చేయాలని ప్రజలు కోరుతున్నారు. అవసరమైతే మండలాల వారీగా గ్రామాలకు సమీపంలో ప్రత్యేక సదస్సులు నిర్వహించడం ద్వారా ఎక్కువ మంది రైతులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.అర్జీల స్వీకరణతో పాటు వాటి పరిష్కారానికి స్పష్టమైన చర్యలు తీసుకుని, గత సదస్సుల్లో ఇచ్చిన వినతులపై పురోగతిని ప్రజలకు తెలియజేస్తేనే రెవెన్యూ సదస్సులపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని ప్రజా, రైతు సంఘాలు అభిప్రాయప డుతున్నాయి. ఈ దిశగా అధికారులు చొరవ చూపాలని కోరుతున్నారు.




