Porumamilla: గిరి నగర్ రేషన్ షాపును తనిఖీ చేసిన వీఆర్వో ఓబన్న
Porumamilla: పోరుమామిళ్ల మండలం గిరి నగర్‌లో రేషన్ షాపును వీఆర్వో ఓబన్న తనిఖీ చేశారు. లబ్ధిదారులకు సరైన తూకంతో బియ్యం అందించాలని డీలర్లకు సూచించారు.
Porumamilla: గిరి నగర్ రేషన్ షాపును తనిఖీ చేసిన వీఆర్వో ఓబన్న
పోరుమామిళ్ల: పేదలకు ప్రభుత్వం మంజూరు చేస్తున్న రేషన్ బియ్యం సక్రమంగా, పూర్తి పరిమాణంలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో పోరుమామిళ్ల మండలం గిరి నగర్‌లోని 15వ నంబర్ రేషన్ షాపును వీఆర్వో కలసపాటి ఓబన్న తనిఖీ చేశారు.
రంగసముద్రం పంచాయతీ పరిధిలోని డీలర్ షాపుల్లో లబ్ధిదారులకు బియ్యం పంపిణీ విధానాన్ని పరిశీలించిన వీఆర్వో ఓబన్న, ప్రభుత్వం మంజూరు చేసిన బియ్యాన్ని ఎలాంటి లోపాలు లేకుండా లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అందించాలని డీలర్లకు సూచించారు.
లబ్ధిదారులకు బియ్యం కొలిచే సమయంలో డబ్బాలు, ఇతర కొలతలతో తక్కువ పరిమాణంలో ఇవ్వకుండా, ప్రతి లబ్ధిదారుడికి సరైన తూకం వేసి బియ్యం అందించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం పేదల కోసం అందిస్తున్న రేషన్ బియ్యం వారికి పూర్తిస్థాయిలో చేరేలా డీలర్లు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
రేషన్ పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా పంపిణీ చేయాలని, లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని వీఆర్వో ఓబన్న డీలర్లకు సూచించారు. రేషన్ షాపుల నిర్వహణ, బియ్యం నిల్వలు, పంపిణీ తీరును అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు.




