Mydukuru: గుడిపాడు అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మాసోత్సవాలు!

Mydukuru: దువ్వూరు మండలం గుడిపాడు అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మాసోత్సవాలు.. పోషకాహారం, PMMVY, ECCE ప్రాధాన్యతను వివరించిన సూపర్‌వైజర్ సౌజన్య.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 11 Sept 2026 3:09 PM IST
Mydukuru
X

Mydukuru: గుడిపాడు అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మాసోత్సవాలు!

Mydukuru: దువ్వూరు మండలం గుడిపాడు గ్రామంలో గుడిపాడు 3 అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సౌజన్య మాట్లాడుతూ సెప్టెంబర్ 9 వ తేదీ నుండి అక్టోబర్ 8వ తేదీ వరకు పోషణమాసోత్సవాలు కార్యక్రమాన్ని ప్రతి అంగన్వాడీ కేంద్రంలో నెల రోజులపాటు జరుపుకుంటాము.

ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యము "మన అంగన్వాడి మన బాధ్యత" అని అంగన్‌వాడీ కేంద్రాలను కేవలం పోషకాహార పంపిణీ కేంద్రాలుగా కాకుండా, సమాజ భాగస్వామ్యంతో కూడిన సంరక్షణ, ఆరోగ్య కేంద్రాలుగా మార్చడమే దీని లక్ష్యం అని,చిరుధాన్యాలు (మిల్లెట్స్), పప్పుధాన్యాలు, ఆకుకూరలు, పండ్లు, మరియు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే స్థానిక ఆహార పదార్థాలు, అలాగే గర్భవతులకు,బాలింతలకు, మరియు ఆరు నుండి మూడు సంవత్సరాల పిల్లలకు టేక్ హోమ్ రేషన్ ప్రకారము పౌష్టికాహారాన్ని అందించడము మరియు అంగన్వాడీ కేంద్రాలలో 3 నుండి 6 సంవత్సరాల చిన్నారులకు, మెనూ ప్రకారం నాణ్యమైన, వేడివేడి పౌష్టికాహారాన్ని అందించడం. మరియు సమాజ భాగస్వామ్యం అంగన్‌వాడీ మేనేజ్‌మెంట్ కమిటీలను బలోపేతం చేసి, పర్యవేక్షణలో స్థానిక ప్రజలను భాగస్వామ్యం చేయడం.

6సంవత్సరాల లోపు పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు అవసరమైన పోషణ, ఆటల ద్వారా కూడిన విద్యను (ECCE) అందించడం,ప్రధానమంత్రి మాతృ వందన యోజన (PMMVY) -గర్భిణులు, బాలింతల సంరక్షణకు ఆర్థిక సహాయం అందించే PMMVY కి అర్హులైన మహిళలందరినీ నమోదు చేయడం, ఐ వి ఆర్ కాల్స్ గురించి ప్రజలకు సూపర్వైజర్ సౌజన్య తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గర్భవతులు, బాలింతలు, పిల్లల తల్లిదండ్రులు అంగన్వాడీ కార్యకర్త రమాదేవి,ఆయా బాలనాగమ్మ ఆశ వర్కర్ పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR