Mydukur: మైదుకూరులో అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళి!

Mydukur: మైదుకూరు మార్కెట్ కూడలిలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించిన ఆర్యవైశ్య సంఘాల నాయకులు. అమరజీవి త్యాగం చిరస్మరణీయమని అధ్యక్షుడు చెన్నకేశవ ప్రసాద్ వ్యాఖ్య.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 1 Nov 2026 12:01 PM IST
Mydukur
X

Mydukur: మైదుకూరులో అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళి!

Mydukur: "ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది" అని ఆర్యవైశ్య సభ అధ్యక్షులు బల్లాని చెన్నకేశవ ప్రసాద్ పేర్కొన్నారు.

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే సంకల్పంతో పొట్టి శ్రీరాములు గారు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష దేశ చరిత్రలోనే ఒక గొప్ప ఉద్యమంగా నిలిచింది. 1952 అక్టోబర్ 19న నిరాహార దీక్ష ప్రారంభించి, 58 రోజుల పాటు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దీక్ష కొనసాగించి, 1952 డిసెంబర్ 15న అమరులయ్యారు.

ఆయన ప్రాణత్యాగం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఆయన చేసిన అపారమైన త్యాగ ఫలితంగానే 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు. ఆయన ఆశయాలు, సేవా స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శంగా నిలవాలి" అని పిలుపునిచ్చారు.

​ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మైదుకూరు పట్టణంలోని మార్కెట్ కూడలిలో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆర్యవైశ్య సభ, ఆర్యవైశ్య యువజన సంఘం, ఆర్యవైశ్య జిల్లా సంఘం, ఆవోపా, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల ప్రతినిధులు, సభ్యులు పాల్గొని అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు.

​ఈ కార్యక్రమంలో బల్లాని చెన్నకేశవ ప్రసాద్‌తో పాటు పబ్బతి గోపాల్, దరిశా శ్రీనివాసులు, యెలిశెట్టి గురు ప్రసాద్, పుట్టా సాయి, మాలేపాటి అభిరామ్, తులసి సత్యసాయి, బచ్చు సురేష్, సురే సుబ్బరాజా, కరమలపూటి సుబ్బరాయుడు, చీదేళ్ల సత్యనారాయణ, మల్లేముల పుల్లయ్య, ఇమ్మిడిశెట్టి సతీష్, మలిపేద్దు హరినాధ్, తల్లం రాజా తదితరులు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR