Duvvuru: దువ్వూరులో 'ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్': గర్భిణీలకు ఉచిత వైద్య పరీక్షలు!

Duvvuru: దువ్వూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారుల ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 9 May 2026 7:21 PM IST
Duvvuru
X

Duvvuru: దువ్వూరులో 'ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్': గర్భిణీలకు ఉచిత వైద్య పరీక్షలు!

దువ్వూరు (మైదుకూరు నియోజకవర్గం): దువ్వూరు ప్రాదమిక అరోగ్య కేంద్రం నందు ప్రధాన మంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ కార్యక్రమం" దువ్వూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సురేష్ బాబు మెడికల్ ఆఫీసర్ మరియు , డాక్టర్ హేమలత, డాక్టర్ వికసిత వారి ఆధ్వర్యంలో నిర్వహించడమైనది . ఈ కార్యక్రమం లో ., దువ్వూరు మండలం పరిధిలో ని అన్ని సచివాలయం పరిధిలో ని గ్రామాల నుండి 26 మంది గర్భిణీ స్త్రీలు పాల్గొన్నరు, ఈ కార్యక్రమం లో డాక్టర్ సుధ గైనకాలజస్ట్ గారు 18 మంది హైరిస్క్ గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ చేయడమైనది మరియు డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ మల్లేసు గారు తనిఖీ చేయడమైనది.అందరికి ఆరోగ్య పరీక్షలు, సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది, మరియు వారిని ఎత్తు, బరువు, హెచ్ బి గ్రూపింగ్, రక్త పరీక్ష లు, యూరిన్, ఆల్బుమిన్, షుగర్ పరీక్షలు చేసినట్లు ల్యాబ్ టెక్నీషియన్ బయన్న తెలిపారు.

ఈకార్యక్రమంలో ర క్త హీనత ఉన్న గర్భిణీ స్త్రీలకు అంగన్వాడీ కేంద్రా లలో ఇచ్చే పోషకాలు కల్గిన చిక్కీలు, ప్రోటీన్స్ విటమిన్స్ కల్గిన కోడిగ్రుడ్లు పాలు ఖనిజలవ ణా లు, క్యాల్షియమ్ కల్గిన రాగి పిండి తో చేసిన రాగి జావ మొదలైనపోషకాలు కల్గిన ఆహారం తీసుకో వాలని డాక్టర్ గారు గర్భిణీ స్త్రీలకు తెలిపారు. ఆకు కూరలు ప్రతి రోజు తీసుకొనే ఆహా రం లో ఉండాలని తెలిపారు. ప్రమాద కర గర్భిణీ స్త్రీలు డాక్టర్స్ పర్యవేక్ష ణ లో ఉండాలని వివరించారు. ప్రతి గర్భిణీ స్త్రీ ప్రభుత్వఆసుపత్రి కి వచ్చికాన్పులు చేయించు కోవాలని అన్నారు. ప్రభుత్వం వారు అందించే ప్రోత్సహ కాలు జనని సురక్ష, ప్రధాన మంత్రి మాతృ త్వ వందనయోజన, జనని శిశు సురక్ష యోజన పధ కాల ద్వారా ప్రతి గర్భిణీ స్త్రీ లబ్ది పొందాలని డాక్టర్ గారు కోరారు..ఈ కార్యక్రమం లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ విజయకుమారి, ఆరోగ్య విస్తరణ అధికారి రాజగోపాల్, , సూపెర్వైసర్ శివగoగరాజు, వీరాంజినేయులు,రవి కుమార్, సిహెచ్ ఓస్,ఏ ఎన్ మ్స్, ఆశా కార్యకర్తలు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story