Madanapalle: 15 మీటర్ల భవనాలకు ఫైర్ NOC మినహాయింపు: ప్రేమ్సా హర్షం!
Madanapalle: 15 మీటర్ల వరకు భవనాలకు ఫైర్ ఎన్‌వోసీ, ఫైర్ వాస్ మినహాయింపునిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయడంపై మదనపల్లె డీఈవో ఆఫీసులో ప్రేమ్సా సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
Madanapalle: 15 మీటర్ల భవనాలకు ఫైర్ NOC మినహాయింపు: ప్రేమ్సా హర్షం!
మదనపల్లె: 15 మీటర్ల వరకు ఎత్తు ఉన్న భవనాలకు ఫైర్ NOC, ఫైర్ వాస్ అవసరం లేదని ప్రభుత్వం జీఓ విడుదల చేయడంపై ప్రేమ్సా సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం మదనపల్లె DEO కార్యాలయంలో ప్రేమ్సా సభ్యులు సమావేశమై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ.. 15 మీటర్ల వరకు భవనాలకు ఫైర్ NOC, ఫైర్ వాస్ నుంచి మినహాయింపు కల్పిస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేయడం అభినందనీయమన్నారు.
ఈ నిర్ణయం కోసం కృషి చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు, మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాషకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం విద్యా సంస్థలు, సంబంధిత వర్గాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సభ్యులు హర్షధ్వానాలు చేస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. కార్యక్రమంలో లక్ష్మీ నారాయణ, కోమల్, వెంకటేశ్, కేశవ రెడ్డి, శ్రీలత, సహదేవ్, మల్లికార్జున, శంకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.




