Proddatur: ప్రొద్దుటూరులో చోరీ కేసు ఛేదన ముగ్గురి అరెస్ట్!

Proddatur: ప్రొద్దుటూరు బస్టాండ్‌లో మహిళ వద్ద గాజులు చోరీ చేసిన ముగ్గురి ముఠా అరెస్ట్. ₹3.90 లక్షల విలువైన 5 తులాల బంగారు గాజులు రికవరీ.

P. GURUSWAMI, PRODDUTUR
Updated on: 19 Sept 2026 9:13 AM IST
Proddatur
X

Proddatur: ప్రొద్దుటూరులో చోరీ కేసు ఛేదన ముగ్గురి అరెస్ట్!

Proddatur: ​ప్రొద్దుటూరు పాత బస్టాండ్‌లో రద్దీని ఆసరాగా చేసుకుని మహిళ వద్ద నుంచి బంగారు గాజులు అపహరించిన ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.3.90 లక్షల విలువైన 5 తులాల బంగారు గాజులను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ విభూకృష్ణ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

ఈ నెల 12న చిలమకూరు గ్రామానికి చెందిన సారెడ్డి లక్ష్మీదేవి బస్సు ఎక్కుతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆమె హ్యాండ్‌బ్యాగ్‌లోని పర్సు నుంచి నాలుగు బంగారు గాజులను చోరీ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఏఎస్పీ పర్యవేక్షణలో, ఇన్‌స్పెక్టర్ డి. రామాంజనేయుడు నేతృత్వంలో ఎస్సై టి. సంజీవరెడ్డి, ఏఎస్ఐ సుబ్బన్న మరియు ఇతర సిబ్బంది సాంకేతిక ఆధారాలు, సమాచారం ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు.

శుక్రవారం సాయంత్రం వాసవి సర్కిల్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపిస్తున్న ముగ్గురిని పఠాన్ షాబినా (27) పఠాన్ ముబీనా (26), పఠాన్ షాహిద్ ఖన్ (29) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు నేరాన్ని అంగీకరించడంతో అరెస్ట్ చేసి, వారి నుంచి చోరీకి గురైన బంగారు గాజులను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా ప్రజలు బస్టాండ్లు, మార్కెట్లు వంటి రద్దీ ప్రదేశాల్లో మహిళలు, వృద్ధులు తమ వద్ద ఉన్న నగలు, హ్యాండ్‌బ్యాగులు, మొబైల్ ఫోన్లు మరియు నగదు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఏఎస్పీ సూచించారు. పరిసరాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR