Proddatur: ప్రొద్దుటూరు వైస్ చైర్మన్‌గా చల్లా రాజగోపాల్ యాదవ్
Proddatur: ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్‌గా చల్లా రాజగోపాల్ యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక, ప్రమాణ స్వీకారం; ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి కృతజ్ఞతలు.
Proddatur: ప్రొద్దుటూరు వైస్ చైర్మన్‌గా చల్లా రాజగోపాల్ యాదవ్
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ గా మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన వైస్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. జాయింట్ కలెక్టర్, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ ఆయనకు ఎన్నిక ధ్రువపత్రాన్ని అందజేశారు.
రాజగోపాల్ యాదవ్ తనకు ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో హామీలు ఇచ్చినా నెరవేరలేదని, వరదరాజుల రెడ్డి మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అన్నారు.
మున్సిపల్ చైర్మన్ నంద్యాల రాఘవ రెడ్డి, టీడీపీ నేతలు ముక్తియార్, బచ్చల పుల్లయ్య, కౌన్సిలర్లకు ధన్యవాదాలు చెప్పారు. పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల సమన్వయంతో కృషి చేస్తానని స్పష్టం చేశారు.




