Proddatur: కష్టాల్లో ఉన్న నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన మున్సిపల్ కమిషనర్!
Proddatur: ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్ మంచానికే పరిమితమైన తండ్రీకొడుకుల ఇంటికి వెళ్లి సదరం పింఛన్ ప్రక్రియ పూర్తి చేయించి అండగా నిలిచారు.
Proddatur: కష్టాల్లో ఉన్న నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన మున్సిపల్ కమిషనర్!
Proddatur: అధికారం అంటే కేవలం పాలన కాదు.. బాధితులకు ఆసరాగా నిలవడమే అని నిరూపించారు కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్. విధి ఆడిన వింత నాటకంలో మంచానికే పరిమితమైన తండ్రీకొడుకులను ఆదుకోవడానికి ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన శ్రీనివాసులు, ఆయన కుమారుడు వెంకటపతి ఇద్దరూ వేర్వేరు అనారోగ్యాలు, ప్రమాణాల కారణంగా మంచానికే పరిమితమయ్యారు.
ఏసీ మెకానిక్‌గా పనిచేసే వెంకటపతి.. పెళ్లయిన నెల రోజులకే విద్యుత్ ఘాతానికి గురై గత నాలుగు నెలలుగా కదల్లేని స్థితిలో ఉన్నాడు. ఒకే ఇంట్లో తండ్రి, తమ్ముడుమంచానికే పరిమితమైన ఆ కుటుంబానికి వైద్య ఖర్చులు, పోషణ భారమయ్యాయి. ఈ క్లిష్ట సమయంలో పెద్ద కుమార్తె రమణమ్మ ధైర్యంగా ముందుకు వచ్చి, ప్రభుత్వ పింఛన్ కోసం మున్సిపల్ కమిషనర్‌ను ఆశ్రయించింది.
రమా విజ్ఞప్తిపై వెంటనే స్పందించిన కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్.. కేవలం అధికారులను పంపడమే కాకుండా, స్వయంగా ఆ నిరుపేద ఇంటికి వెళ్లారు. తండ్రీకొడుకుల దీనస్థితిని చూసి చలించిపోయారు. వెంటనే జంగంపేట 41వ స్వర్ణ వార్డ్ - స్వర్ణ గ్రామం సిబ్బందిని ఇంటికి పిలిపించి.. అనారోగ్య పింఛన్‌కు సంబంధించిన 'సదరం' (SADAREM) దరఖాస్తు ప్రక్రియను స్వయంగా దగ్గరుండి పూర్తి చేయించారు.
ఆ పత్రాలను బాధితులకు అందించి త్వరలోనే పింఛన్ ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు. కష్టకాలంలో తమ ఇంటికి వచ్చి అండగా నిలిచిన కమిషనర్‌కు ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. ఒక అధికారి బాధ్యతను మించి స్పందించి, ప్రభుత్వ సేవలను నేరుగా ప్రజల చెంతకు చేర్చడం పట్ల స్థానిక ప్రజలు కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్‌ను అభినందనలతో ముంచెత్తుతున్నారు.




