Kadapa: ప్రొద్దుటూరు కమిషనర్ విశ్వనాథ్ సంచలన వ్యాఖ్యలు

Kadapa: ప్రొద్దుటూరులో అవినీతి రహిత పాలన అందిస్తామని మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ స్పష్టం చేశారు. తాను లంచం అడిగినా ఏసీబీకి పట్టించవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 4 Aug 2026 7:58 AM IST
Kadapa
X

Kadapa: ప్రొద్దుటూరు కమిషనర్ విశ్వనాథ్ సంచలన వ్యాఖ్యలు

జిల్లా : కడప

నేను లంచం అడిగినా ACBకి పట్టించండి..

ప్రొద్దుటూరు కమిషనర్ విశ్వనాథ్ సంచలన వ్యాఖ్యలు...

ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో అవినీతికి తావులేకుండా పాలన అందించడమే తన లక్ష్యమని మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ స్పష్టం చేశారు. మున్సిపాలిటీలో పనిచేసే ఏ అధికారి లేదా ఉద్యోగి లంచం అడిగినా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, "ఒకవేళ నేనే లంచం అడిగినా ఏసీబీకి ఫిర్యాదు చేయండి" అంటూ కమిషనర్ విశ్వనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ప్రజలకు సేవ చేయడానికే అధికారులకు జీతాలు ఇస్తోందని, ఏ పని కోసం కూడా ప్రజలు లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పూర్తిస్థాయి అవినీతి రహిత పాలన అందించేందుకు కట్టుబడి ఉన్నామని కమిషనర్ విశ్వనాథ్ తెలిపారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR

Next Story