Proddatur: ప్రొద్దుటూరు నియోజకవర్గ సమస్యలు, ప్రజా సమస్యలపై షర్మిలతో సుదీర్ఘ చర్చ!
Proddatur: విజయవాడలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డిని కలిసిన ప్రొద్దుటూరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా. నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి పనులపై సుదీర్ఘ చర్చ.
Proddatur: ప్రొద్దుటూరు నియోజకవర్గ సమస్యలు, ప్రజా సమస్యలపై షర్మిలతో సుదీర్ఘ చర్చ!
Proddatur: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డిని ప్రొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా ఈరోజు మర్యాదపూర్వకంగా విజయవాడలో కార్యాలయంలో కలిశారు. ఈ సమావేశంలో ప్రొద్దుటూరు పట్టణంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా నిలిచిపోయిన అభివృద్ధి పనులు, ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలపై వారు సుదీర్ఘంగా చర్చించారు.
ఇర్ఫాన్ బాషా నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులను వైఎస్ షర్మిలకు వివరించారు. ప్రొద్దుటూరులో మౌలిక వసతుల లేమి, తాగునీటి ఎద్దడి, డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారడం, రోడ్ల దుస్థితి మరియు స్థానిక వ్యాపారులు, చేనేత కార్మికులు, పేద ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆమె దృష్టికి తీసుకెళ్లారు.
ప్రజలకు అండగా నిలవాలని వైఎస్ షర్మిల ఇర్ఫాన్ బాషా కు సూచించారు.. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని, ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ వారికి నిరంతరం అండగా నిలవాలని ఇర్ఫాన్ బాషాకు దిశానిర్దేశం చేశారన్నారు
"ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలి. క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారమయ్యే వరకు కాంగ్రెస్ శ్రేణులు పట్టుదలతో కృషి చేయాలి" అని షర్మిల తెలియచేశారన్నారు... ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున నిరంతరం పోరాటాలు నిర్వహిస్తామని, నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఆయన స్పష్టం చేశారు.




