Proddatur: దస్తావేజు లేఖరుల సమ్మె జీఓ 396 రద్దుకు డిమాండ్!
Proddatur: ప్రభుత్వం తెచ్చిన జీఓ నంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని కడప జిల్లా ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖరులు నిరవధిక సమ్మె చేపట్టారు.
Proddatur: దస్తావేజు లేఖరుల సమ్మె జీఓ 396 రద్దుకు డిమాండ్!
Proddatur: కడప జిల్లా ప్రొద్దుటూరులో దస్తావేజుల లేఖరులు నిరవధిక సమ్మెకు దిగారు. జి.ఓ నెంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా దస్తావేజుల లేఖరుల సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ.. బ్రిటిష్ కాలం నుంచి దస్తావేజుల లేఖరులుగా జీవనం సాగిస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన జి.ఓ నెంబర్ 396 అమలులోకి వస్తే తమ ఉపాధి దెబ్బతిని, వందలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జి.ఓను రద్దు చేసి తమ జీవనోపాధిని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు తమ నిరవధిక సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో స్టాంప్ రైటర్ అధ్యక్షులు జమాల్, ముని శేఖర్, రమేష్, సుభాష్, జనార్దన్, నారాయణ, పవన్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.




