Proddatur: పంచాయతీ ఎన్నికలనైనా ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలి: రాచమల్లు!
Proddatur: కడప జిల్లా ప్రొద్దుటూరులో గ్రామ పంచాయతీ ఎన్నికలనైనా ప్రజాస్వామ్యబద్ధంగా, నిర్భయ వాతావరణంలో నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కోరారు.
Proddatur: పంచాయతీ ఎన్నికలనైనా ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలి: రాచమల్లు!
ప్రొద్దటూరు: పంచాయతీ ఎన్నికలనైనా ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎన్నికల అధికారులకు విజ్ఞప్తి చేశారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో అభ్యర్థులు స్వేచ్ఛగా పోటీ చేసేలా, ప్రజలు తమకు నచ్చిన వారికి నిర్భయంగా ఓటు వేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కోరారు.
గత స్థానిక సంస్థలు, ఎంపీటీసీ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, నామినేషన్ పత్రాలను చించివేయడం, లాఠీచార్జీలు, రాళ్ల దాడులు వంటి ఘటనలు జరిగాయని ఆయన ఆరోపించారు. అధికార యంత్రాంగం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిందని విమర్శించారు.
కూటమి నాయకుల దాడులకు అధికారులు సహకరించారన్న విమర్శలు రాకుండా, ఈసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా కలెక్టర్, ఎస్పీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఘర్షణలు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు.
ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని అన్ని పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ తరఫున అభ్యర్థులను బరిలోకి దింపుతామని రాచమల్లు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ సానబోయిన శేఖర్ యాదవ్, బీసీ నాయకులు కంభం వెంకటేశ్వర్లు తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




