Proddatur: కూటమి పాలనంతా అబద్ధాలే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
Proddatur: కూటమి ప్రభుత్వ 26 నెలల పాలనపై సీఎం చంద్రబాబు ప్రజంటేషన్ పచ్చి అబద్ధాల మయమని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శ.
Proddatur: కూటమి పాలనంతా అబద్ధాలే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
ప్రొద్దటూరు: కూటమి ప్రభుత్వం 26 నెలల పరిపాలనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3 గంటల పాటు ఇచ్చిన ప్రజంటేషన్ అంతా పచ్చి అబద్ధాల మయమని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 3లక్షల50 కోట్లు అప్పులు చేసి దేశంలోనే ఏపీని నంబర్ వన్ స్థానంలో నిలిపారని రాచమల్లు ఎద్దేవా చేశారు.
కూటమి సర్కార్ పాలనంతా కోతలు, ఎగవేతలతోనే సాగుతోందని దుయ్యబట్టారు. ఎన్నికలకు ముందు కొండంత హామీలు ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక గోరంత కూడా అమలు చేయడం లేదని మండిపడ్డారు. 22 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.
చివరికి కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, లేబర్ పనులను కూడా కొత్త ఉద్యోగాలుగా ఖాతాలో వేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం లో కరోనా కష్టకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైనప్పటికీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 2 ఏళ్ల పాలనలోనే 1లక్ష 31 కోట్ల సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారని గుర్తుచేశారు. ఎన్నికల హామీలను పైసాతో సహా నేరుగా పేద, మధ్యతరగతి ప్రజలకు అందించి నెరవేర్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని రాచమల్లు స్పష్టం చేశారు.




