Proddatur: ఎమ్మెల్యే కొడుకే ఇసుక మాఫియా డాన్.. కలెక్టర్‌కు వినతి

Proddatur: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే, ఆయన కుమారుడు కలిసి రోజుకు రూ.30 లక్షల విలువైన ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి ఆరోపించారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 16 May 2026 8:54 PM IST
Proddatur
X

Proddatur: ఎమ్మెల్యే కొడుకే ఇసుక మాఫియా డాన్.. కలెక్టర్‌కు వినతి

Proddatur: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కొడుకు రోజుకు ముప్పై లక్షల రూపాయల ఇసుక దోపిడీ చేస్తున్నారని పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి ఆరోపించారు.ప్రొద్దుటూరు ఇసుక దోపిడీపై రైతులతో కలిసి కడప జిల్లా కలెక్టర్ ను కలిసిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రొద్దుటూరు, చౌడూరు గ్రామ దళిత రైతులకు,వ్యవసాయం తప్ప మరో వ్యాపకం తెలియదని,

50ఏళ్లుగా సాగు చేస్తున్న పెన్నా ఏటి ఒడ్డున ఉన్న భూములను పరిశ్రమల పేరిట చెప్పా పెట్టకుండా బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీఐసీసీ పరిశ్రమల తీసుకుని కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేశారు కాంట్రాక్టు కూడా ఎమ్మెల్యే కొడుకే తీసుకున్నాడని అన్నారు. ఏటి ఒడ్డున ఉన్న ఈ భూములను చదును చేస్తూ అక్కడ ఉన్న ఇసుకను ఆక్రమంగా తరలిస్తున్నారని కోట్లలో సంపాదిస్తున్నారని అన్నారు. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకొని గత సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నా రైతులకు న్యాయం చేయాలని కోరారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR

Next Story