Proddatur: ఒడిశా నుంచి తెచ్చి అమ్ముతున్న గంజాయి ముఠా అరెస్ట్
Proddatur: వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో గంజాయి ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు.
Proddatur: ఒడిశా నుంచి తెచ్చి అమ్ముతున్న గంజాయి ముఠా అరెస్ట్
Proddatur: కడప జిల్లా ప్రొద్దుటూరులో గంజాయి విక్రయాలపై పోలీసులు మరోసారి ఉక్కుపాదం మోపారు. ప్రత్యేక దాడుల్లో 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు డియస్పి కార్యక్రమంలో వివరాలు వెల్లడించిన ఏఎస్పి విభూ కృష్ణ.
ప్రొద్దుటూరు త్రి టౌన్ పోలీసులకు అందిన సమాచారంతో బొల్లవరం సమీపంలో పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు పురుషులు, ఓ మహిళను అరెస్టు చేశారు.
విచారణలో మహిళ ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి ప్రొద్దుటూరులో విక్రయిస్తున్నట్లు, మిగిలిన ఇద్దరు ఆమె వద్ద నుంచి కొనుగోలు చేసి చిన్న ప్యాకెట్లుగా అమ్ముతున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి రూ.3 వేల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.
నిందితులపై NDPS చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అడిషనల్ ఎస్పీ తెలిపారు. గంజాయి విక్రయాలు, రవాణాపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఏఎస్పి తెలిపారు.. ఈ కార్యక్రమం లో సీఐ రామాంజనేయులు, ఎస్ఐ సంజీవరెడ్డి, మహమ్మద్, సిబ్బంది పాల్గొన్నారు.




