Proddatur: జెఎన్టీయుఏ సౌత్ జోన్ చెస్ పోటీలకు ప్రొద్దుటూరు విద్యార్థిని ఎంపిక
Proddatur: ప్రొద్దుటూరు గౌతమి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని కె. అమృత లక్ష్మి జెఎన్టీయుఏ సౌత్ జోన్ చెస్ పోటీలకు ఎంపిక. కాలేజ్ యాజమాన్యం అభినందనలు.
Proddatur: జెఎన్టీయుఏ సౌత్ జోన్ చెస్ పోటీలకు ప్రొద్దుటూరు విద్యార్థిని ఎంపిక
ప్రొద్దుటూరు: గౌతమి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్ ఫర్ ఉమెన్ (అటానమస్) కళాశాలకు చెందిన ఈఈఈ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని కె. అమృత లక్ష్మి జెఎన్టీయుఏ సౌత్ జోన్ చెస్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 9 నుండి 12 వరకు హైదరాబాద్ లో జరిగే అంతర్ విశ్వవిద్యాలయాల సౌత్ జోన్ చెస్ పోటీలలో ఆమె పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా కళాశాల చైర్మన్లు సి. నాగూర్, బి. రవీంద్రా రెడ్డి, కరస్పాండెంట్ కె.సి. బాబమ్మ, డైరెక్టర్ సి. శైలూష, ప్రిన్సిపాల్ డా. ఎం. రామసుబ్బమ్మ, ఫిజికల్ డైరెక్టర్లు జి. ఓబయ్య, జి. ప్రవల్లిక విద్యార్థినిని అభినందించారు.
విద్యార్థినులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా యాజమాన్యం ఆకాంక్షించారు.




