Proddatur: కడపలో మంత్రి నారా లోకేష్ పర్యటన పూర్తి వివరాలు

Proddatur: కడప జిల్లాలో రెండు రోజుల పాటు మంత్రి నారా లోకేష్ పర్యటన. జమ్మలమడుగులో శంకుస్థాపన, ప్రొద్దుటూరులో టీడీపీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 14 July 2026 9:35 PM IST
Proddatur
X

Proddatur: కడపలో మంత్రి నారా లోకేష్ పర్యటన పూర్తి వివరాలు

ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెండు రోజుల కడప జిల్లా పర్యటనకు విచ్చేయనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. మొదటగా జమ్మలమడుగు నియోజకవర్గం దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణ పనులు శంకుస్థాపన చేయనున్న మంత్రి నారా లోకేష్.

అనంతరం 15వ తేదీ మధ్యాహ్నం ప్రొద్దుటూరు టిడిపి క్రియాశీలక కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొనున్న మంత్రి నారా లోకేష్. ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, స్థానిక అభివృద్ధి పనులపై చర్చించడంతోపాటు భవిష్యత్తు కార్యాచరణ పై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారు.

స్థానిక సమస్యల పరిష్కారంపై పార్టీ కార్యకర్తల నుంచి వినతులు గాని స్వీకరించే అవకాశం ఉందని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలిపారు.. ఈ పర్యటన భాగంగా కార్యకర్తలు విజయవంతం చేస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్తియార్, టిడిపి సీనియర్ నేత సీఎం సురేష్ నాయుడు, మాజీ జడ్పిటిసి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు..

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR

Next Story