Proddatur: ప్రొద్దుటూరులో టీడీపీ ‘మహానాడు’ సమరశంఖం.. వర్చువల్ వేడుకలు!
Proddatur: ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో 12 క్లస్టర్ల వారీగా వర్చువల్ విధానంలో నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ ‘మహానాడు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పిలుపునిచ్చారు.
Proddatur: ప్రొద్దుటూరులో టీడీపీ ‘మహానాడు’ సమరశంఖం.. వర్చువల్ వేడుకలు!
Proddatur: ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో 12 క్లస్టర్ల వారీగా వర్చువల్ గా నిర్వహించే తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం స్థానిక భారత్ ఫంక్షన్ హాల్ లో టిడిపి పట్టణ అధ్యక్షులు చల్లా రాజగోపాల్ అధ్యక్షతన నిర్వహించిన తెలుగుదేశం పార్టీ బూతు, క్లస్టర్ లెవెల్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ సాధించిన విజయాలను రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకుంటున్న నిర్ణయాలను స్థానిక నియోజకవర్గ వారీగా జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించేందుకే ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ జాతీయ శాఖ ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు.
ప్రతి సంవత్సరం ఏదో ఒక జిల్లా కేంద్రాన్ని ఎంచుకుని మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే అన్నారు కానీ ఈ సంవత్సరం ప్రస్తుత దేశ పరిస్థితుల కారణంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు పొదుపును పాటించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయంతో ఈనెల 27, 28 తేదీలలో వర్చువల్ గా మహానాడు ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నిత్యం ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజలిచ్చిన ఈ బాధ్యతను ప్రజాసేవకే అంకితం చేస్తానని పునరుద్ఘాటించారు.
ముందుగా టిడిపి యువ నాయకుడు నంద్యాల కొండారెడ్డి మాట్లాడుతూ ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో 12 క్లస్టర్లుగా విభజించి మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఒక్కొక్క క్లస్టర్ కు 7 లేక 8 వార్డులను కేటాయించమని రాజుపాలెం మండలం ప్రొద్దుటూరు మండల పరిధిలో మరో నాలుగు క్లస్టర్లుగా విభజించామని తెలిపారు. ఆయా క్లస్టర్ల వివరాలు వేదికలు ఇన్చార్జిల పేర్లను ఆయన సభ దృష్టికి తెచ్చారు. ప్రతి క్లస్టర్లో 400 మందికి పైగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ సభ్యత్వం కార్డును తీసుకొని హాజరు కావాల్సి ఉంటుందని అప్పుడే రాష్ట్ర శాఖకు మనం జరిపిన మహానాడు కార్యక్రమం విజయవంతమైనట్లు అవకాశం ఉందని పేర్కొన్నారు.
కావున ప్రతి ఒక్కరూ ప్లాస్టర్ వైజ్ గా పాల్గొని మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వి.ఎస్ ముక్తి ఆర్ రాష్ట్ర నాయకులు సీఎం సురేష్ నాయుడు మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ బేపారి జాకీర్ అహ్మద్ టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి వైఎస్ జేబీవుల్లా కొత్తపల్లి మాజీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు నల్లబోతుల నాగరాజు శ్రీనివాసాచారి టిడిపి నాయకులు కామిశెట్టి బాబు మరియు పెద్ద ఎత్తున క్లస్టర్ ఇంచార్జిలు బూతు ఇన్చార్జులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




