Proddatur: ప్రొద్దుటూరు అభివృద్ధికి నిధులివ్వండి: సీఎంకు ఎమ్మెల్యే వినతి!

Proddatur: ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధి పనులకు తగినన్ని నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి అమరావతిలో సీఎం నారా చంద్రబాబు నాయుడిని కోరారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 10 Nov 2026 8:30 PM IST
Proddatur
X

Proddatur: ప్రొద్దుటూరు అభివృద్ధికి నిధులివ్వండి: సీఎంకు ఎమ్మెల్యే వినతి!

ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులకు తగినన్ని నిధులు మంజూరు చేయాలని వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కోరారు. మంగళవారం అమరావతిలో సీఎం చంద్రబాబును ఆయన నేరుగా కలిసి, నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ పనులన్నింటికీ అవసరమైన నిధులను త్వరగా విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం ప్రొద్దుటూరులో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా సీఎంతో చర్చించారు. ​ముఖ్యమంత్రిని కలిసిన వారిలో టిడిపి యువ నాయకుడు నంద్యాల కొండారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, శివాలయం చైర్మన్ వంగల నారాయణరెడ్డి, కట్టమీది మోహన్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు బచ్చల ప్రతాప్, యోగివేమన ఇంజనీరింగ్ కళాశాల నాన్ టీచింగ్ యూనియన్ ప్రెసిడెంట్ రసూల్ గౌస్ తదితరులు ఉన్నారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR