Proddatur: బాలుర వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి!
Proddatur: యానాది కాలనీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి. ఆహార నాణ్యతలో లోపాలుంటే సహించేది లేదని వార్డెన్‌కు హెచ్చరిక.
Proddatur: బాలుర వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి!
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మండల పరిధిలోని యానాది కాలనీలో ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహము - 2 ను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
దూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటున్న విద్యార్థులతో మాట్లాడి, సరిగ్గా చదువుకోవాలని సూచించారు. వారికి అందుతున్న భోజనం నాణ్యత, రుచి మరియు హాస్టల్లోని సౌకర్యాలపై ఆరా తీశారు. హాస్టల్ వంటశాలను ప్రత్యక్షంగా పరిశీలించడంతో పాటు కార్యాలయ రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
అసంపూర్తిగా ఉన్న హాస్టల్ గదుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ చింతామణి తో ఫోన్లో మాట్లాడి ఆదేశించారు.
పిల్లలకు నాణ్యమైన ఆహారం, మెరుగైన వసతులు అందించాలి. ఆహార నాణ్యతలో గానీ, వసతుల కల్పనలో గానీ ఎలాంటి లోపాలున్నా, ఫిర్యాదులు వచ్చినా సహించేది లేదు. అని హాస్టల్ వార్డెన్‌ను ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి హెచ్చరించారు.




