Proddatur: మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధం.. 23న ప్రమాణం!

Proddatur: ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక, ప్రమాణ స్వీకారం నవంబర్ 23న జరగనుంది. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, చైర్మన్ రాఘవరెడ్డిలకు కమిషనర్ ఆహ్వాన పత్రం అందించారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 19 Nov 2026 7:06 AM IST
Proddatur
X

Proddatur: మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధం.. 23న ప్రమాణం!

Proddatur: కడప జిల్లా ప్రొద్దుటూరులో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరియు ప్రమాణ స్వీకార మహోత్సవం ఈ నెల నవంబర్ 23న జరగనుంది.

ఈ వేడుకకు హాజరు కావాల్సిందిగా కోరుతూ మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ స్థానిక శాసనసభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు నంద్యాల వరదరాజులరెడ్డిని మరియు చైర్మన్ డిజిగ్నేటెడ్ నంద్యాల రాఘవరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి 'ఫారం-2' అందించి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా నూతన కౌన్సిల్ సభ్యులందరికీ కమిషనర్ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సహకారంతో.. ప్రొద్దుటూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నూతన కౌన్సిల్ కృషి చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

చైర్మన్ నంద్యాల రాఘవరెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్లకు మున్సిపల్ పట్టణ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR