Proddatur: ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్గా రాఘవరెడ్డి ప్రమాణ స్వీకారం
Proddatur: కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్గా నంద్యాల రాఘవరెడ్డి, 52 మంది కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం; వైస్ చైర్మన్గా చల్లా రాజగోపాల్ యాదవ్ ఎన్నిక.
Proddatur: ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్గా రాఘవరెడ్డి ప్రమాణ స్వీకారం
ప్రొద్దుటూరు: కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి సమక్షంలో నూతన ప్రొద్దుటూరు పురపాలక సంఘం నూతన పాలకవర్గం కొలువుదీరింది. ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన 52 మంది కౌన్సిలర్లతో పాటు మున్సిపల్ చైర్మన్గా నంద్యాల రాఘవరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వైస్ చైర్మన్గా చల్లా రాజగోపాల్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ప్రమాణ స్వీకారానికి ముందు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, నూతన చైర్మన్, కౌన్సిలర్లు స్థానిక గాంధీ పార్కులో మహాత్మా గాంధీ, అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే, ఎన్టీఆర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అక్కడి నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం సమావేశ మందిరంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి
గత పాలకులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, కూటమి ప్రభుత్వ సహకారంతో నూతన పాలకవర్గం పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. నూతన మున్సిపల్ చైర్మన్ నంద్యాల రాఘవరెడ్డి మాట్లాడుతూ కౌన్సిలర్లు, అధికారుల సమన్వయంతో ప్రొద్దుటూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర షేక్ కార్పొరేషన్ చైర్మన్ వి.ఎస్. ముక్తియార్, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, సీనియర్ నాయకులు ఈవీ సుధాకర్ రెడ్డి, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబొత్తుల నాగరాజుతో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.




