Proddatur: ఐస్‌క్రీమ్ వేషంలో గంజాయి చాక్లెట్ల విక్రయం నిందితుడి అరెస్ట్!

Proddatur: ప్రొద్దుటూరులో ఐస్‌క్రీమ్ విక్రేతలా నటిస్తూ గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న యూపీకి చెందిన పింటు కుమార్‌ను వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 25 Aug 2026 2:52 PM IST
Proddatur
X

Proddatur: ఐస్‌క్రీమ్ వేషంలో గంజాయి చాక్లెట్ల విక్రయం నిందితుడి అరెస్ట్!

Proddatur: ప్రొద్దుటూరులో ఐస్‌క్రీమ్ విక్రయిస్తున్నట్లు నటిస్తూ గంజాయి అమ్ముతున్న ఉత్తరప్రదేశ్ కు చెందిన పింటు కుమార్ అనే వ్యక్తిని వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు ఏఎస్పీ విభూకృష్ణ తెలిపారు. నిందితుడు ఉత్తరప్రదేశ్ నుంచి గంజాయి తీసుకువచ్చి, గంజాయి ని చాక్లెట్ల రూపంలో మార్చి విక్రయిస్తునటువంటి తెలిపారు.. నిందితుడు పింటు కుమార్, ప్రొద్దుటూరు విధుల్లో ఐస్‌క్రీమ్ విక్రేతలా తిరుగుతూ స్థానిక యువతకు గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఉత్తరప్రదేశ్ నుంచి గంజాయిని తీసుకువచ్చి, ఎవరికీ అనుమానం రాకుండా చాక్లెట్ రూపంలోకి మార్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 1,280 గ్రాముల గంజాయి మరియు 11 గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితుడిపై కేసు నమోదు చేసిన వన్‌టౌన్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారని ఏఎస్పీ తెలిపారు... ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సీఐ కొండారెడ్డి, ఎస్ఐ మధుసూదన్ రెడ్డి, మరియు సిబ్బంది పాల్గొన్నారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR

Next Story