Proddatur: కూటమి పాలనలో బ్యాంక్ నగదుకు రక్షణ లేదు రాచమల్లు!
Proddatur: ప్రొద్దుటూరు టౌన్ బ్యాంకులో ఇన్సూరెన్స్ సొమ్ము దారి మళ్లింపుపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఆగ్రహం. నిందితులపై జ్యుడీషియల్ విచారణ జరపాలని డిమాండ్.
Proddatur: కూటమి పాలనలో బ్యాంక్ నగదుకు రక్షణ లేదు రాచమల్లు!
Proddatur: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రొద్దుటూరులో ప్రజల డబ్బుకు, ప్రభుత్వ భూములకు, యువత ఉద్యోగాలకు రక్షణ లేకుండా పోయిందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రమాదవశాత్తు మరణించిన ఎలక్ట్రికల్ ఉద్యోగి సుబ్బరాయుడు ఇన్సూరెన్స్ పరిహారం ₹11 లక్షలు ప్రొద్దుటూరు టౌన్ బ్యాంకులో జమయ్యాయి.
బ్యాంక్ రికార్డుల ప్రకారం మృతుడి కుమార్తె 'సుచరిత' నామినీగా ఉంది. అయితే, ఈ విషయం ఆమెకు తెలియకుండానే టీడీపీ నేత ఈవి సుధాకర్ రెడ్డి, సుచరిత స్థానంలో 'ఉషారాణి' అనే మరొక మహిళను తీసుకెళ్లి ఆ డబ్బును విత్‌డ్రా చేయించారు. ఈ వివాదంపై స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి స్పందించకపోవడంపై రాచమల్లు ప్రశ్నించారు. విషయం వెలుగులోకి రావడంతో ఎమ్మెల్యే కుమారుడు కొండారెడ్డి రంగంలోకి దిగి, సుధాకర్ రెడ్డితో మాట్లాడి ఆ డబ్బును తిరిగి బ్యాంకులో జమ చేయించారని తెలిపారు.
కూటమి నాయకులు యువతకు దక్కాల్సిన డీఎస్సీ ఉద్యోగాలను కూడా అమ్ముకున్నారని ఆరోపించారు. ఈ బ్యాంక్ మోసం, అక్రమాలపై పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా జ్యుడీషియల్ విచారణ జరిపించాలని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు.




