ప్రజా సమస్యలు వదిలేసి అక్రమ కేసులా?: కూటమి రెండేళ్ల వైఫల్యాలపై 'వైఎస్సార్‌సీపీ' సమరభేరి.. ప్రొద్దుటూరులో రాచమల్లు ధ్వజం!

కూటమి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 30 May 2026 8:34 PM IST
ప్రజా సమస్యలు వదిలేసి అక్రమ కేసులా?: కూటమి రెండేళ్ల వైఫల్యాలపై వైఎస్సార్‌సీపీ సమరభేరి.. ప్రొద్దుటూరులో రాచమల్లు ధ్వజం!
X

ప్రొద్దుటూరు (కడప జిల్లా): మాజీ ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి శనివారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న నేపథ్యంలో ప్రజా సమస్యలు, ఎన్నికల హామీల అమలులో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు జగన్ పై అక్రమ కేసులు బనాయించే ప్రయత్నం చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ కు దిగుతున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూన్ 4, 8, 12 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన వెంటనే చంద్రబాబు నాయుడు మరో కొత్త కథనం అల్లి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమై రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టడానికే ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. “లిక్కర్ స్కాం” పేరుతో పాత ఆరోపణలను మళ్లీ తెరపైకి తీసుకువచ్చి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. ఇటీవల కూటమి నాయకులు ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం కూడా రాజకీయ ఒత్తిడుల భాగమని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ వ్యక్తిగత సహాయకుడు కేఎన్‌ఆర్‌ను సిట్ అధికారులు విచారిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, రూ.19 కోట్ల లావాదేవీలపై ప్రశ్నలు వస్తున్నాయని తెలిపారు. అలాగే చంద్రబాబు నాయుడు ఆస్తుల పెరుగుదలపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయని, దీనిపై పారదర్శకంగా సమగ్ర విచారణ జరగాలని రాచమల్లు డిమాండ్ చేశారు. మీడియా సంస్థల యజమానుల ఆస్తులపై కూడా దర్యాప్తు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. వైఎస్సార్‌సీపీ ప్రజల సమస్యలపై పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. జగన్ గతంలో జైలు జీవితం అనుభవించినా ఏ పరిస్థితుల్లోనూ బెదిరే వ్యక్తి కాదని, ఇప్పుడూ అక్రమ కేసులకు భయపడరని ఆయన అన్నారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR

Next Story