Proddatur: ప్రొద్దుటూరు నియోజకవర్గం రాజుపాలెం ఎంపీపీ, ఉప ఎంపీపీలు ఏకగ్రీవం!
Proddatur: వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం రాజుపాలెం మండల పరిషత్ అధ్యక్షుడిగా బంగ్లా సవీన్, ఉప ఎంపీపీగా తులసి ఈశ్వర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Proddatur: ప్రొద్దుటూరు నియోజకవర్గం రాజుపాలెం ఎంపీపీ, ఉప ఎంపీపీలు ఏకగ్రీవం!
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రాజుపాలెం మండల పరిషత్ లో ఎంపీపీ, ఉప ఎంపీపీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఎంపీపీగా రాజుపాలెం మండలం ఎంపీటీసీ బంగ్లా సవీన్, ఉప ఎంపీపీగా పగిడాల ఎంపీటీసీ ఈశ్వర్ రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం రాజుపాలెం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో జరిగిన నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలతో సమావేశం నిర్వహించారు.
మండలంలో మొత్తం 9 మంది ఎంపీటీసీలు ఉండగా, సభ్యుల బలంతో అందరు ఏకగ్రీవంగా బంగ్లా సవీన్ ని ఎంపీపీగా బలపరచగా మాజీ జెడ్పిటిసి తోట మహేశ్వర్ రెడ్డి ప్రకటించారు. ఉప ఎంపీపీ పదవికి తులసి ఈశ్వర్ రెడ్డి పేరును బలపరచగా, రెండు పదవులకు ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. ఈ కార్యక్రమం లో రిటర్నింగ్ అధికారులు, ఎంపీటీసీలు, కూటమి నేతలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




