Proddatur: ప్రొద్దుటూరులో SIGA ఆధ్వర్యంలో స్వాతంత్ర వేడుకలు

Proddatur: ప్రొద్దుటూరులో SIGA యూనియన్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర వేడుకలు. కొర్రపాడు రోడ్డు కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరించిన అసోసియేషన్ అధ్యక్షుడు దస్తగిరి.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 15 Aug 2026 5:30 PM IST
Proddatur
X

Proddatur: ప్రొద్దుటూరులో SIGA ఆధ్వర్యంలో స్వాతంత్ర వేడుకలు

ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు స్టీల్ ఐరన్ గ్లాస్ అల్యూమినియం (SIGA) ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని ఆగస్టు 15న ప్రొద్దుటూరులో శివాలయం నుంచి ర్యాలీగా వెళ్లి కొర్రపాడు రోడ్డులోని వారి కార్యాలయం వద్ద మువ్వన్నెల జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించారు.

​అసోసియేషన్ సభ్యులు కార్మికుల మధ్య స్వీట్లు పంపిణీ చేసి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర్య సమరయోధుల దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన త్యాగమూర్తులను ఈ సందర్భంగా వారు గుర్తుచేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు దస్తగిరి, వల్లి మహమ్మద్ రఫీ పఠాన్ అసోసియేషన్ ప్రతినిధులు కార్మికులు పాల్గొన్నారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR

Next Story