Proddatur: ప్రొద్దుటూరు 48వ వార్డులో మురుగునీటి సమస్యపై తక్షణ స్పందన
Proddatur: ప్రొద్దుటూరు 48వ వార్డు అన్నమ్మ హాస్టల్ వెనుక మురుగునీటి సమస్యపై కౌన్సిలర్ యనమల సుబ్బిరెడ్డి స్పందన; శాశ్వత పరిష్కారానికి చైర్మన్ రాఘవరెడ్డి ఆదేశం.
Proddatur: ప్రొద్దుటూరు 48వ వార్డులో మురుగునీటి సమస్యపై తక్షణ స్పందన
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మున్సిపాలిటీ 48వ వార్డు పరిధిలోని అన్నమ్మ హాస్టల్ వెనుక లైన్‌లో చిన్నపాటి వర్షానికే రోడ్లు మురికి కుంటాలుగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన 48వ వార్డు కౌన్సిలర్ యనమల సుబ్బిరెడ్డి వెంటనే స్పందించి, మున్సిపల్ చైర్మన్ నంద్యాల రాఘవరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై చర్చించిన చైర్మన్, తక్షణమే మున్సిపల్ అధికారులను పిలిపించి, ఆ ప్రాంతంలో మురుగునీటి నిల్వ లేకుండా శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కౌన్సిలర్, చైర్మన్ తక్షణ స్పందనపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




