Proddatur: బీసీలపై రాచమల్లు అసత్య ప్రచారాలు ఆపాలి కౌన్సిలర్ నరేంద్ర హెచ్చరిక!

Proddatur: బీసీలపై వైసిపి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ప్రొద్దుటూరు 30వ వార్డు టీడీపీ కౌన్సిలర్ నరేంద్ర తీవ్ర ఆగ్రహం.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 3 Nov 2026 1:49 PM IST
Proddatur
X

Proddatur: బీసీలపై రాచమల్లు అసత్య ప్రచారాలు ఆపాలి కౌన్సిలర్ నరేంద్ర హెచ్చరిక!

Proddatur: బీసీల పట్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే రచమల్లు శివప్రసాద్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని 30వ వార్డు టీడీపీ కౌన్సిలర్ నరేంద్ర మండిపడ్డారు. ​ప్రొద్దుటూరులో ఇటీవల జరిగిన కౌన్సిలర్ ఎన్నికల్లో 52 మంది కౌన్సిలర్లకు గాను 30 మంది బీసీలకే టీడీపీ టికెట్లు ఇవ్వడమే కాకుండా, వారి గెలుపునకు పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కృషి చేశారాని స్పష్టం చేశారు.

గెలిచిన ఆ 30 మందిలో దాదాపు 15 మంది నిరుపేద చేనేత వర్గానికి చెందినవారేనని, బీసీల పట్ల టీడీపీకి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి ఎంత ప్రేమ ఉందో దీని వల్లనే తెలుస్తుందని తెలిపారు. ​బీసీలు, చేనేతలు ఎప్పటికీ టీడీపీ వెంటే ఉంటారని, ఇప్పటికైనా మాజీ ఎమ్మెల్యే రచమల్లు తన అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని కౌన్సిలర్ నరేంద్ర హెచ్చరించారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR