Proddatur: మహానాడులో మెరిసిన ప్రొద్దుటూరు.. వర్చువల్ వేదికపై సత్తా చాటిన వైనం

Proddatur: ప్రొద్దుటూరులో టీడీపీ మహానాడు వర్చువల్ కార్యక్రమం ఘనవిజయం.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 29 May 2026 7:56 AM IST
Proddatur
X

Proddatur: మహానాడులో మెరిసిన ప్రొద్దుటూరు.. వర్చువల్ వేదికపై సత్తా చాటిన వైనం

ప్రొద్దుటూరు: నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి ఆయన కుమారుడు నంద్యాల కొండారెడ్డి ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమంలో ఘనంగా నిర్వహించాలని ప్రొద్దుటూరు పరిధిలో 12 క్లస్టర్ గా విభజించి మహానాడు వర్చువల్ కార్యక్రమం ప్రారంభించారు. ఈనెల 27వ తేదీన మొదటి రోజు మహానాడు వర్చువల్ కార్యక్రమంలో మొదటగా ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, ప్రొద్దుటూరు పరిశీలకులు భావన, తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో భారీ స్థాయిలో కార్యకర్తలు పాల్గొనడంతో కడప జిల్లాలోనే మొదటి స్థానంలో ఈ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మొదటి రోజు ప్రొద్దుటూరు 5వ స్థానం సత్తా చాటింది.. అదేవిధంగా ఈ నెల 28 మహానాడు వర్చువల్ కార్యక్రమంలో మరలా భారీ స్థాయిలో కార్యకర్తలు పాల్గొనడంతో రాష్ట్ర వ్యాప్తంగారెండవ రోజు ప్రొద్దుటూరు 8 స్థానం నిలిచింది. ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి ఆయన తనయుడు కొండారెడ్డి ఈ మహానాడు వర్చువల్ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేశారు. ఎమ్మెల్యే తనయుడు కొండారెడ్డి మాట్లాడుతూ ఇంత ఘన విజయం సాధించినందుకు ప్రతి ఒక్క కార్యకర్తల తిరుగులేని పట్టుదలనే నిదర్శనం అన్నారు. ఈ వర్చువల్ మహానాడు వర్చువల్ కార్యక్రమాన్ని విజయవంతంలో భాగస్వాములైన టిడిపి నాయకులకు ప్రతి కార్యకర్తకు అభిమానులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలిపారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR

Next Story