Proddatur: ఏకగ్రీవాల వల్ల గ్రామాల అభివృద్ధి వేగవంతం
Proddatur: ప్రొద్దుటూరు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి విలేకరుల సమావేశం; పంచాయతీ ఏకగ్రీవాలతో నిధులు పెరిగి అభివృద్ధి వేగవంతమవుతుందని స్పష్టం.
Proddatur: ఏకగ్రీవాల వల్ల గ్రామాల అభివృద్ధి వేగవంతం
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరులోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. గ్రామాలకు నిధులు తీసుకొస్తామన్న హామీతోనే పలు పంచాయతీలు ఏకగ్రీవమవుతున్నాయని తెలిపారు. ఏకగ్రీవాలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. గతంలో మున్సిపాలిటీలో అవినీతి, ఇళ్ల పట్టాల భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని, ఇళ్ల నిర్మాణం పేరుతో లబ్ధిదారుల నుంచి రూ.35 వేల చొప్పున వసూలు చేశారని ఆరోపించారు.
నిరాధార విమర్శలు మానుకుని అభివృద్ధి చేసి చూపించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. మరోవైపు, ఏకగ్రీవమైన పంచాయతీలకు జనాభా ఆధారంగా రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అదనపు నిధులు అందే అవకాశం ఉందని టీడీపీ సీనియర్ నేత ఈవీ సుధాకర్ రెడ్డి వివరించారు.
ప్రొద్దుటూరు నియోజకవర్గంలో దాదాపు 30 పంచాయతీల్లో టీడీపీ, వైసీపీ వర్గాలు పరస్పర అవగాహనతో సర్పంచ్, వార్డు స్థానాలను సర్దుబాటు చేసుకుని ఏకగ్రీవాలకు అంగీకరించాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి జబీవుల్లా, సీనియర్ నేత లక్ష్మిరెడ్డి, చౌడూరు సర్పంచ్ అభ్యర్థి రవికుమార్ రెడ్డి, కౌన్సిలర్లు కృష్ణ యాదవ్ ఉట్టి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.




