Proddatur: రెండో మైసూరుగా ప్రొద్దుటూరు దసరా ఉత్సవాలు!
Proddatur: భారతదేశంలోనే రెండో మైసూరుగా పేరుగాంచిన వైఎస్‌ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలు వైభవంగా ప్రారంభం.
Proddatur: రెండో మైసూరుగా ప్రొద్దుటూరు దసరా ఉత్సవాలు!
Proddatur: దసరా ఉత్సవాల్లో భారత దేశంలోనే రెండో మైసూరు గా పేరుగాంచిన కడప జిల్లా ప్రొద్దుటూరు దసరా ఉత్సవాలతో పట్టణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ప్రధానంగా ప్రొద్దుటూరు లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం లో దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య సభ ఆధ్వర్యంలో ఘనంగా పండుగ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అయు ఆరోగ్యాలతో అమ్మవారి ఆశీస్సులు కలగాలని శ్రద్ధ తో నిర్వహిస్తారు. అమ్మవారి శాల నుంచి 102 మంది ఆర్య వైశ్య మహిళలు కల్చలు ఊరేగింపు గా వచ్చి శివాలయం నుంచి నవగంగ జలాలను తీసుకువచ్చి పూజలు నిర్వహిస్తారు.
మంగళవాయిద్యాలతో ఘనంగా నిర్వహిస్తారు.. దర్శన ఏర్పాట్లు ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా ఆలయ కమిటీ వారు పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు.




