Proddatur: వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థిగా నరసింహారెడ్డి నామినేషన్!

Proddatur: కడప ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ నేత పోరెడ్డి నరసింహారెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డితో కలిసి నామినేషన్ వేశారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 17 Oct 2026 2:37 PM IST
Proddatur
X

Proddatur: వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థిగా నరసింహారెడ్డి నామినేషన్!

Proddatur: ​వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ, సందడి నెలకొంది. ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరించింది. ఇందులో భాగంగా వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోరెడ్డి నరసింహారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.

నామినేషన్ దాఖలు చేయడానికి ముందు ప్రొద్దుటూరులోని ప్రసిద్ధ శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పోరెడ్డినరసింహారెడ్డి స్థానిక నాయకులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక అర్చనలు చేశారు. పట్టణాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని వేడుకున్నారు.

అమ్మవారి దర్శనం అనంతరం ఆలయం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా తరలివెళ్లారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో ప్రొద్దుటూరు స్థానిక మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రత్యేకంగా పాల్గొన్నారు. పోరెడ్డి నరసింహారెడ్డి వెంటే ఉండి నామినేషన్ ప్రక్రియను దగ్గరుండి పూర్తి చేయించారు.

ఈ సందర్భంగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ... ప్రొద్దుటూరు అభివృద్ధి కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, అత్యధిక మెజార్టీతో పోరెడ్డి నరసింహారెడ్డి చైర్మన్‌గా గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR