Proddatur: ప్రొద్దుటూరులో వైసీపీ మౌన ప్రదర్శన.. రాచమల్లు విమర్శలు

Proddatur: ప్రొద్దుటూరు మున్సిపల్ ప్రమాణ స్వీకారానికి నిరసనగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ‘ప్రజా విద్రోహ దినం’ మౌన ప్రదర్శన.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 23 Nov 2026 11:23 PM IST
Proddatur
X

Proddatur: ప్రొద్దుటూరులో వైసీపీ మౌన ప్రదర్శన.. రాచమల్లు విమర్శలు

ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారానికి నిరసనగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సోమవారం ఆందోళన చేపట్టాయి. రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ‘ప్రజా విద్రోహ దినం’ పేరుతో మౌన నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ప్రజల ప్రత్యక్ష ఓటుతో కాకుండా మున్సిపల్ చైర్మన్, 52 మంది కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరగడాన్ని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తప్పుబట్టారు. నామినేషన్లు వేసే స్వేచ్ఛ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించుకున్న కూటమి ప్రభుత్వంపై ప్రజలు తిరగబడాలని ఆయన పిలుపునిచ్చారు.

భవిష్యత్తులో ప్రజా మద్దతుతో అధికారంలోకి రాగానే, ప్రస్తుత పాలకమండలిని తొలగించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తామని రాచమల్లు పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోరెడ్డి నరసింహారెడ్డిని ప్రజల ఓట్లతోనే గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ మౌన ప్రదర్శనలో వైసీపీ చైర్మన్ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి, 52 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR