Proddatur: సోములవారిపల్లె నామినేషన్ల తిరస్కరణపై వైసీపీ ఆగ్రహం

Proddatur: ప్రొద్దుటూరు మండలం సోములవారిపల్లె పంచాయతీ నామినేషన్ల తిరస్కరణపై వైసీపీ నేతల అభ్యంతరం; ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఒత్తిడి వల్లేనని ఆరోపణ.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 24 Nov 2026 10:11 PM IST
Proddatur
X

Proddatur: సోములవారిపల్లె నామినేషన్ల తిరస్కరణపై వైసీపీ ఆగ్రహం

ప్రొద్దుటూరు: ​ప్రొద్దుటూరులోని మాజీ ఎంపీపీ సానబోయిన శేఖర్ యాదవ్ నివాసంలో వైసీపీ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల ​నామినేషన్ల పరిశీలన సమయంలో లోపాలుంటే ముందే చెప్పకుండా, రాత్రి సమయంలో తిరస్కరించడం వెనుక ఆంతర్యమేమిటని వారు ప్రశ్నించారు.

​ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, ఆయన కుమారుడు కొండారెడ్డి ఒత్తిడితోనే అధికారులు ఇలా వ్యవహరించారని వైసీపీ నాయకులు ఆరోపించారు. ​

ఎన్నికల అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, తిరస్కరణకు గల కారణాలపై స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ​ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ వైస్‌చైర్మన్ బంగారు మునిరెడ్డి, మాజీ సర్పంచ్ ప్రశాంతితో పాటు పలువురు వార్డు అభ్యర్థులు పాల్గొన్నారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR