Proddutur: తమిళనాడులో ‘విజయ్’ ప్రభంజనం.. దక్షిణాదిలో కాంగ్రెస్ బలోపేతం దేశ రాజకీయాల్లో మార్పుకు నాంది: ఇర్ఫాన్ బాషా
Proddutur: తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్‌కు ప్రొద్దుటూరు కాంగ్రెస్ ఇంచార్జ్ ఇర్ఫాన్ బాషా శుభాకాంక్షలు తెలిపారు.
Proddutur: తమిళనాడులో ‘విజయ్’ ప్రభంజనం.. దక్షిణాదిలో కాంగ్రెస్ బలోపేతం దేశ రాజకీయాల్లో మార్పుకు నాంది: ఇర్ఫాన్ బాషా
ప్రొద్దుటూరు (కడప జిల్లా): కడప జిల్లా ప్రొద్దుటూరు కాంగ్రెస్ ఇంచార్జ్ ఇర్ఫాన్ బాషా విలేకల్ల సమావేశం లో మాట్లాడుతూ నేడు తమిళనాడు ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు కావడం ప్రజాస్వామ్య శక్తుల విజయమని అన్నారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ లౌకికవాద మరియు సంక్షేమ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ టీవీకేకు అండగా నిలవడం దేశ రాజకీయాల్లో ఒక కొత్త మార్పుకు నాంది అని అన్నారు.
దక్షిణాదిలో ఇప్పటికే కేరళ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయని, ఇప్పుడు తమిళనాడులో కూడా కాంగ్రెస్ మద్దతుతో టీవీకె ప్రభుత్వం ఏర్పాటు కావడం హర్షినీయమన్నారు. ప్రజలను మతం, ద్వేషం పేరుతో విడదీయాలని ప్రయత్నించే శక్తులకు తమిళనాడు ప్రజలు గట్టి సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. టీవీకే, కాంగ్రెస్ మరియు ఇతర మిత్రపక్షాలు కలిసి ఏర్పరచిన ఈ ప్రభుత్వం సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి, యువత మరియు పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా లౌకికవాద శక్తులు ఒక్కటవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, దక్షిణ భారత రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలోపేతం అవుతున్న పరిస్థితులు 2029 సాధారణ ఎన్నికల్లో కీలక ప్రభావం చూపుతాయని అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ముందుకు సాగుతోందని, తమిళనాడులో ఏర్పడిన ఈ కూటమి దేశ రాజకీయాలకు ఒక కొత్త దిశను చూపుతుందని ఇర్ఫాన్ బాషా పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో కూడా పార్టీ మరింత బలోపేతం అవుతూ, 2029 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ షర్మిలా రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని ఇర్ఫాన్ బాషా ఆశాభావం వ్యక్తం చేశారు.




