Kadapa: వైవీయూ విద్యా సలహాదారుగా ఆచార్య పి. చంద్ర ఓబుల్ రెడ్డి
Kadapa: కడప యోగి వేమన విశ్వవిద్యాలయం విద్యా సలహాదారుగా అకడమిక్ వ్యవహారాల డీన్ ఆచార్య పి. చంద్ర ఓబుల్ రెడ్డి నియామకం. నియామక పత్రం అందజేసిన వీసీ రాజశేఖర్.
Kadapa: వైవీయూ విద్యా సలహాదారుగా ఆచార్య పి. చంద్ర ఓబుల్ రెడ్డి
కడప: యోగి వేమన విశ్వవిద్యాలయ కళాశాల - ప్రధానాచార్యుల కార్యాలయ కేంద్రీకృత పరిపాలన విభాగ విద్యా సలహాదారులుగా అకడమిక్ వ్యవహారాల డీన్ ఆచార్య పి. చంద్ర ఓబుల్ రెడ్డి ని నియమిస్తూ నియామకపు పత్రాన్ని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ అందజేశారు.
కేంద్రీకృత పరిపాలనా కార్యాలయం సరికొత్తగా ఏర్పాటు చేశారు. ప్రతిపాదిత ఈ కార్యాలయం, విశ్వవిద్యాలయం విద్యా అవసరాల ఆధారంగా వివిధ విభాగాలలోని అకడమిక్ కన్సల్టెంట్లకు బోధనా సంబంధిత అవసరాల కేటాయింపు చూస్తుంది. అలానే విద్యా సంబంధిత బాధ్యతలను సమన్వయం చేయడంతో పాటు, పర్యవేక్షణ చేయనుందని తెలిపారు.
Next Story




