Kadapa: వేముల మండలంలో కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పర్యటన

Kadapa: వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలంలో బుధవారం విస్తృతంగా పర్యటించారు.

T. AMARNATH, PULIVENDULA
Published on: 27 May 2026 9:56 PM IST
Kadapa
X

Kadapa: వేముల మండలంలో కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పర్యటన

Kadapa: పులివెందుల నియోజకవర్గ పర్యటనలో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి బుధవారం వేముల మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పనులను పరిశీలించారు.

మొదటగా గొందిపల్లె గ్రామంలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్) నిర్వహణకు సంబంధించి జరుగుతున్న సన్నాహక ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలను తనిఖీ చేసి, హౌస్ సర్వే కార్యక్రమంలో పాల్గొని గ్రామస్థులతో మాట్లాడారు. ఎన్యుమరేషన్ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మేడపెంట గ్రామంలో ఇటీవల అకాల వర్షాలు, ఈదురు గాలులకు నేలకొరిగిన అరటి పంటలను కలెక్టర్ పరిశీలించారు. నష్టపోయిన రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో కలిసి పంట నష్టం ప్రాథమిక నివేదికలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపిస్తామని రైతులకు హామీ ఇచ్చారు.తదుపరి వేముల మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ పనులు చేపడుతున్న ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చిన కలెక్టర్, పనులను నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాలల పునఃప్రారంభం నాటికి స్మార్ట్ కిచెన్ షెడ్లను వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డిఆర్వో మలికార్జునుడు, పులివెందుల ఆర్డీవో చిన్నయ్య, డిహెచ్ఓ సతీష్ కుమార్, డిఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, పీఆర్ ఎస్‌ఈ మద్దన్న, ఆర్డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ఏడుకొండలు, స్మార్ట్ కిచెన్స్ నోడల్ అధికారి జోయల్ విజయ్ కుమార్, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

T. AMARNATH, PULIVENDULA

T. AMARNATH, PULIVENDULA

Next Story